Today Horoscope Rasi Phalalu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజూ ప్రతి వ్యక్తికి ఏదో ఒక రూపంలో సహకారం ఉంటుంది. అలాంటి విషయాలను ఆస్ట్రాలజీ తెలుపుతుంది. ఈ శాస్త్రం ప్రకారం 2023 అక్టోబర్ 12న గురువారం 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
కొన్ని రంగాల వారు తోటివారిని ఆకట్టుకుంటారు. అస్థిర నిర్ణయాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల నుంచి అపార్థాల మూట కట్టుకోకండి.ఆత్మ విశ్వాసంతోముందుకు వెళితే అన్నీ శుభాలే. సూర్య దేవుడిని పూజిస్తే మరింత మంచిది.
వృషభం:
గతంలో మొదలుపెట్టిన ముఖ్యమైన పనులు తోటి వారి సహాయంతో పూర్తవుతాయి. బిడియం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏకాగ్రతతో పని చేస్తే అనుకున్నవి సాధిస్తారు. మనశ్శాంతి లోపించినప్పుడు చంద్ర ధ్యానం చేయండి.
మిథునం:
కొన్ని పనులు ప్రారంభించేముందు కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి. పట్టుదల, ఏకాగ్రతతో పనులు మొదలు పెడితే అనుకున్నది సాధిస్తారు. ముఖ్యమైన విషయాల్లో ముందుచూపు తప్పనిసరి. గణపతి దేవారాధన చేస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.
కర్కాటకం:
కుటుంబ శ్రేయస్సు కోసం చేసే ఆలోచనలు సత్ఫలితాల్నిస్తాయి. కొన్ని వర్గాల వారికి మనశ్శాంతి లోపించవచ్చు. అయితే ముందు చూపుతో పనులు చూస్తే సూర్య దేవునిని కొలిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.
సింహం:
ఉద్యోగులు శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార వర్గానికి చెందిన వారు ఆచితూచి వ్యవహరించాలి. ఒక వార్త ఈ రాశివారికి ఆనందాన్ని కలిగిస్తుంది. అరోగ్యంగా ఉంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించడం శ్రేష్ఠం.
కన్య:
పెద్దలతో వాదనలు దిగొద్దు. ప్లానింగ్ ప్రకారంగా పనులు చేయాలి. ఇప్పటి వరకు ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఈ రాశివారు ఈశ్వరాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
తుల:
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మనోబలంతో కొన్ని విజయం సాధిస్తారు. ఉద్యోగార్థులకు అధికారుల అండదండలు ఉంటాయి. ఆరోగ్యకరంగా జీవిస్తారు. శివుడిని ఆరాధించడం వల్ల అనుకూల ఫలితాలు.
వృశ్చికం:
ఆత్మవిశ్వాసంతో చేసే పనులు సక్సెస్ అవుతాయి. పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. అవసరానికి సాయం చేసేవారు ముందుకు వస్తారు. విష్ణు పూజలు అనుకూల ఫలితాలు.
ధనస్సు:
వ్యాపారం చేసేవారు అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవడం ఉపకరిస్తుంది. అనవసర ఖర్చుల జోలికి పోకూడదు. భవిష్యత్ గురించి ప్రణాళిక వేస్తారు. వాదనలకు దిగొద్దు.. పట్టింపులకు వెళ్లకూడదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది.
మకరం:
మొదలుపెట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు వెళ్లాలి. విమర్శలను పట్టించుకోవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సూర్యనారాయణుడిని పూజించడం వల్ల అనుకున్నవి జరుగుతాయి.
కుంభం:
కొన్ని పనుల్లో కటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల అంతా మంచే జరుగుతుంది.
మీనం:
కొన్ని కీలక నిర్ణయాలు లాభిస్తాయి. అయితే ఎవరినీ అతిగా నమ్మొద్దు. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తి చేయాలి. శని ధ్యానం చేయడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి.