Rahu lunar eclipse effects: ప్రతి ఏడాదిలో సూర్య, చంద్రగ్రహణం ఏర్పడతాయి. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు సూర్య, చంద్రగ్రహణం ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 7న రెండో చంద్ర గానం ఏర్పడబోతోంది. ఏడవ తేదీ రాత్రి 9.56 గంటలకు ప్రారంభమైన ఈ గ్రహణం 8వ తేదీ అర్ధరాత్రి 1.26 గంటలకు ముగుస్తుంది. మొత్తం మూడు గంటల 30 నిమిషాల పాటు గ్రహణం ఉంటుంది. ఇందులో రాత్రి 11.42 గంటలకు గ్రహణ మధ్యస్థ కాలమని పేర్కొంటున్నారు. ఈ గ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనబడబోతుంది. అందువల్ల సూతకాలం వర్తిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే రాహు గ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నందున కొన్ని రాశులపై ప్రభావం అధికంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. మరి ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..
రాబోయే చంద్రగ్రహణం సందర్భంగా నాలుగు రాశులపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని కొందరు పండితులు చెబుతున్నారు. వీటిలో మిథునం, సింహం, కుంభం, మీనం ఉన్నాయి. ఈ రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో గ్రహణం చూడకూడదు అని చెబుతున్నారు. వీరు గ్రహణం చూడడం వల్ల అనవసరపు వివాదాల్లో చిక్కుకుంటారు. వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. గ్రహణ సమయంలో రాహువు కుంభరాశిలో ఉంటాడు. దీంతో ఈ రాశి వారు గ్రహణం వీక్షిస్తే మానసికంగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరపు తలనొప్పులు ఏర్పడతాయి. తెలియకుండానే గొడవలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తికాకుండా ఉంటాయి. అనుకోని అవాంఛనీయ సంఘటనలు ఎదురవుతాయి. అందువల్ల వీరు గ్రహణం చూడకపోవడమే మంచిదని చెబుతున్నారు.
అయితే గ్రహణ సమయంలో ఈ రాశుల వారు పరిహారం కోసం కొన్ని పాటించాలని అంటున్నారు. ఈ సమయంలో శివారాధన చేయాలి. రాహు గ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. బెల్లం వంటి పదార్థాలను సమర్పించాలి. దుర్గాదేవిని పూజించడం.. వెండి వస్తువులు దానం చేయడం వల్ల కొంతవరకు సమస్యలు పరిష్కరించుకోవచ్చని అంటున్నారు. అయితే ఈ గ్రహణం వల్ల ఈ రాశుల వారికి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. గ్రహణం పట్టువిడుపు స్నానాలు చేయడం వల్ల దోష నివారణ జరిగే అవకాశం ఉంటుంది.
ఈ రాశి వారు మాత్రమే కాకుండా గర్భిణీలు సైతం గ్రహణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి. వీరు ఈ సమయంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అలాగే గ్రహణ సమయంలో నిద్ర పోకుండా.. ధ్యానం చేయాలని అంటున్నారు. లేదా ఇష్ట దైవ జపం చేసిన సరిపోతుంది అని అంటారు. అయితే గ్రహణ సమయంలో ప్రయాణాలు గానీ.. శుభకార్యాలు గాని.. కొత్త పనులు ప్రారంభించడం కానీ చేయొద్దు. వీలైనంతవరకు ఈ సమయంలో పూజలు చేయకుండా ఉండాలి. సాయంత్రం 6 గంటలకు భోజనాలు పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసిన తర్వాతనే ఆహారాన్ని వండుకొని తినాలి. గ్రామానికి ముందు ఉన్న ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. అయితే ఇంట్లో ఉండే కొన్ని పదార్థాల్లో గరిక వేయడం వల్ల దోషం నుంచి తప్పించుకోవచ్చు.