Pawan Kalyan OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం రోజురోజుకి మార్కెట్ లో క్రేజీ మూవీ గా మారిపోతుంది. సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాపై షూటింగ్ ప్రారంభం దశ నుండే అంచనాలు భారీగా ఉండేవి. సుజిత్ ఫ్లాప్ దర్శకుడే అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ తో ఒక న్యూ ఏజ్ గ్యాంగ్ స్టర్ డ్రామా జానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అని తెలియడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోనే కాదు, మామూలు ఆడియన్స్ లో కూడా ఈ చిత్రం అంచనాలు పెరిగాయి. వీటి అన్నిటికి మించి రెండేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఒక గ్లింప్స్ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా విడుదలైన రెండు పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఎటు చూసినా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కం బ్యాక్ సినిమాగా మిగలబోతుందని అభిమానులకు ఒక స్పష్టమైన సంకేతం వెళ్ళిపోయింది.
ఇదంతా పక్కన పెడితే సెప్టెంబర్ 25 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ని 5 రోజుల క్రితం నార్త్ అమెరికా లో మొదలు పెట్టారు. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 5 రోజుల అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 8 లక్షల డాలర్లు వచ్చాయి. రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడం తో, రేపటితో ఎలా అయినా 1 మిలియన్ ప్రీ సేల్స్ మార్కుని అందుకునే చెయ్యాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అయితే ఈ చిత్రం ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా నిల్చిన ‘కూలీ'(Coolie Movie) నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ రికార్డు ని బద్దలు కొడుతుందా లేదా అని ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
‘కూలీ’ చిత్రానికి నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ ద్వారా మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు నార్త్ అమెరికా లో 3 మిలియన్ డాలర్ల ప్రీమియర్స్ గ్రాస్ ని అందుకున్న ఇండియన్ చిత్రాలు #RRR , పుష్ప 2 , కల్కి మరియు కూలీ. ఇప్పుడు ‘ఓజీ’ కూడా ఈ లిస్ట్ లోకి జాయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టాక్. కేవలం ఓవర్సీస్ లోనే కాదు, వరల్డ్ వైడ్ గా కూలీ చిత్రానికి మొదటి రోజు 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘ఓజీ’ చిత్రం ఈ ఓపెనింగ్ ని క్రాస్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఓజీ కి ఉన్నటువంటి క్రేజ్ ని చూస్తుంటే, కచ్చితంగా ఈ చిత్రం కూలీ ని దాటడమే కాదు, పాజిటివ్ టాక్ వస్తే 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని కూడా మొదటి రోజు రాబడుతుందని అంటున్నారు విశ్లేషకులు.