Horoscope – Rashiphalalu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 18న సోమవారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మిథునం, కుంభ రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సందర్భంగా 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
ప్రయాణాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనుల్లో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సాయంత్రం వాతావరణం ఆహ్లదంగా ఉంటుంది.
వృషభం:
కుటుంబం కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బాధ్యతలను నిర్వర్తించడంలో శ్రద్ధ చూపుతారు.
మిథునం:
వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. కొత్త భాగస్వాములను కలుస్తారు. ఓ సమాచారం నిరాశను కలిగిస్తుంది. అనవసర విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేయవద్దు. లేకుంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కర్కాటకం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులైతే వారి సీనియర్లతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. జీవితంలోకి కొత్త అతిథి రావొచ్చు
సింహం:
ఈరోజు వీరు ఆహ్లదంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు. కొన్ని తప్పులకు క్షమాపణలు చెబుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.
కన్య:
ఇతరుల నుంచి ఆర్థిక సాయం పొందవచ్చు. కొత్త ఇల్లు కొనుగోలు చేసేవారికి మంచి సమయం. ఏదైనా విషయంలో సందేహం ఉంటే పెద్దలను సంప్రదించాలి.
తుల:
పెట్టుబడులకు అనుకూల సమయం. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో స్ఫష్టంగా ఉండాలి. ఇతరుల వివాదాల్లో తలదూర్చితే మీకే ప్రమాదం. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు.
వృశ్చికం:
పెండింగులో ఉన్న పనులు నేటితో పూర్తవుతాయి. డబ్బులు అప్పుగా ఇవ్వరు. ఇస్తే తిరిగొచ్చే అవకాశాలు తక్కువ. కొత్త పనుల కోసం వ్యూహం పన్నుతారు.
ధనస్సు:
ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో వాదనలకు దిగొద్దు. ఎంత సంయమనం అంటే అంత బాగుంటారు. ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం.
మకర:
ఆరోగ్య సమస్యలు ఎదరయ్యే అవకాశం ఎక్కువ. కొత్త వస్తువులు ఇప్పుడే కొనుగోలు చేయొద్దు. విహార యాత్రలకు వెళ్లొచ్చు. ఆలోచనాత్మకంగా ప్రణాళికలు రూపొందించాలి.
కుంభం:
కుటుంబంలో ఉన్న గొడవలు నేటితో పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యల నుచి విముక్తి పొందుతారు. ఉద్యోగులు పై అధికారుతలో తిట్లు తినాల్సి వస్తుంది. తల్లిదండ్రుల ఆశీస్సులతో పెండింగు పనులు పూర్తి చేస్తారు.
మీనం: అప్పు పుడుతుంది. ఇంట్లో వాతావరణం ఆహ్లదకరంగా ఉంటుంది. కొత్త పనులు చేపడుతారు. ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా ఉంటారు.