Gold Silver Prices : బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరిగిన ధరలు సోమవారం స్థిరంగా కొనసాగాయి. వెండి ధరలు కూడా భారీగానే పతనమయ్యాయి. దీంతో శుభకార్యాలు నిర్వహించుకునేవారికి పండుగే అని అంటున్నారు. వెండిధరలు కూడా స్థిరంగానే కొనసాగుతుండడంతో ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
బులియన్ మార్కెట్ ప్రకారం.. డిసెంబర్ 18న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,300గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,510 గా ఉంది. డిసెంబర్ 17న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,300తో విక్రయించారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,660గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,300 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,510 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,900 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,160తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,300 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,510తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,300తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,510తో విక్రయిస్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు స్థిరంగానే కొనసాగాయి. సోమవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.77,700గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.77,700గా ఉంది. ముంబైలో రూ.77,700, చెన్నైలో రూ.79,700, బెంగుళూరులో 75,500, హైదరాబాద్ లో రూ.79,700తో విక్రయిస్తున్నారు.