
దుర్గగుడి నికర ఆదాయం గోల్‌మాల్‌పై విచారణ ఏది? అని ట్విట్టర్‌లో టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. 3 వెండి సింహాల మాయంపై విచారణ ఏమయ్యిందని ఆయన నిలదీశారు. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ సమావేశాలు, నిధుల పక్కదారిపై చర్యలేవి? అని ప్రశ్నించారు. వందల కోట్ల విలువైన వెంకటేశ్వరస్వామి భూములకు ఎసరు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో దేవుడి ఆస్తులకే రక్షణలేకుండా పోయిందంటున్న భక్తుల మాటలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని ట్విట్టర్‌లో దేవినేని ఉమ డిమాండ్ చేశారు.