https://oktelugu.com/

మహేష్ గురించి ఆసక్తికర విషయాలని బయటపెట్టిన అడివిశేష్

డైరెక్టర్ ‘శశికిరణ్ తిక్క’ దర్శకత్వంలో అడివిశేష్ హీరోగా రూపొందుతున్న మూవీ ‘మేజర్’. సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు తన ప్రొడక్షన్ హౌస్ లో ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2008 ముంబయి దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని గురువారం అడివి శేష్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. […]

Written By:
  • admin
  • , Updated On : December 18, 2020 / 07:39 PM IST
    Follow us on


    డైరెక్టర్ ‘శశికిరణ్ తిక్క’ దర్శకత్వంలో అడివిశేష్ హీరోగా రూపొందుతున్న మూవీ ‘మేజర్’. సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు తన ప్రొడక్షన్ హౌస్ లో ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2008 ముంబయి దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని గురువారం అడివి శేష్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.

    Also Read: వెయ్యి కోసం కేఫ్ లో పనిచేశా… బాబాయ్ జపాన్ పిల్ల అనేవాడు

    పుట్టిన రోజు సందర్బంగా ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అడివిశేష్ మాట్లాడుతూ…తన తల్లి తండ్రులు రెండు సంవత్సరాల తర్వాత ఇండియా కి వచ్చి తనతో ఉండటం, న్యూ మూవీ “మేజర్” వలన ఈ పుట్టిన రోజు తనకి చాలా స్పెషల్ అని అన్నారు.ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటపెట్టాడు. ఈ మూవీ సహా నిర్మాత అయిన మహేష్ బాబు గారు అసలు కథే వినకుండా ఈ సినిమాని ఒప్పుకున్నారని వెల్లడించాడు. నేను నమ్రత గారికి మాత్రమే స్క్రిప్టు చెప్పాను. నా మీద, నా టీం మీద మహేష్, నమ్రత గారికి అపారమైన నమ్మకం ఉందని, అలా వాళ్ళు పెట్టిన నమ్మకంతో నా మీద బాధ్యత మరింత పెరిగింది. ఒక ఉత్తమ చిత్రాన్ని వాళ్లకి కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నాను. మూవీ ప్రొడక్షన్‌కు సంబంధించి మాకు ఏం కావాలంటే అది ఇచ్చి మాకు చాలా సపోర్ట్ ఇచ్చారని అన్నారు .

    Also Read: కరణ్ జోహార్ మెడకు డ్రగ్స్ కేసు… ఆ స్టార్స్ గుండెల్లో రైళ్లు!

    తెలుగు , హిందీ రెండు భాషలలో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హిందీలో అడివి శేష్ కి ఇది మొదటి మూవీ.శేష్ “గూడాచారి” మూవీని డబ్ చేసి “ఇంటెలిజెంట్ కిలాడీ ” గా యూట్యూబ్ లో రిలీజ్ చేయటం ద్వారా హిందీ ప్రేక్షకులకి పరిచయం ఉన్నాడు. మేజర్ మూవీ షూటింగ్ ఇంకా 40శాతం చెయ్యాల్సి ఉందని , రిలీజ్ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. మేజర్ మూవీ లో అడవి శేష్ తో పాటు శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్