
తిరుపతి ఉప ఎన్నికలో ఎమ్మార్పీఎస్ పోటీ చేస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపన అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. అన్ని పార్టీలు తమను మోసం చేసినందున తమ బలం, ఐక్యత చాటి చెప్పటానికి పోటీ చేస్తున్నామని కృష్ణమాదిగ తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికలకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల అయ్యే సూచనలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మూడు నెలలకు ముందే సన్నాహాలు మొదలు పెట్టాయి. ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండమని పార్టీ జిల్లా శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి చర్యలు మొదలు పెట్టారు.