
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. వెలగపూడిది బోగస్ డిగ్రీ… ఆయన విద్యార్హతపై త్వరలో కేసు పడుతుందని హెచ్చరించారు. వెలగపూడికి హైదరాబాద్‌లో ఇల్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌తో పాటు.. బినామీ పేర్లతో ఇళ్లు ఉన్నాయని ఆరోపించారు. వెలగపూడి బినామీలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వెలగపూడి లంచం ఇచ్చి రౌడీషీట్ తీయించుకున్నాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు.