
దేవాలయాలపై దాడుల్ని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. ఏపీ సర్వమత సమ్మేళనమని, ఆలయాలపై అరాచక శక్తుల దాడులు దారుణమని ట్విట్టర్‌లో గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను రాజకీయం చేయడం కన్నా.. నివారించడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం నిందితులను గుర్తించి బహిర్గతం చేయాలని, దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.