https://oktelugu.com/

వ్యాపారికి అంబటి రాంబాబు పేరుతో బెదిరింపు కాల్‌..

ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరిట తనకు అర్ధరాత్రి బెదిరింపు కాల్‌ వచ్చిందని గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన వ్యాపారి పెరుమాళ్ల హనుమాన్‌ ప్రసాద్‌ నరసరావుపేట రోడ్డులోని సర్వే నెంబర్‌ 174లో తనకు 11 సెంట్ల స్థలం ఉందని దాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించగా ఇటీవల మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే పిడుగరురాల్ల మండలం కరాలపాడుకు చెందిన ఎం.శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అంబటి […]

Written By: , Updated On : September 25, 2020 / 08:59 AM IST
unknown person

unknown person

Follow us on

unknown person

ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరిట తనకు అర్ధరాత్రి బెదిరింపు కాల్‌ వచ్చిందని గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన వ్యాపారి పెరుమాళ్ల హనుమాన్‌ ప్రసాద్‌ నరసరావుపేట రోడ్డులోని సర్వే నెంబర్‌ 174లో తనకు 11 సెంట్ల స్థలం ఉందని దాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించగా ఇటీవల మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే పిడుగరురాల్ల మండలం కరాలపాడుకు చెందిన ఎం.శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరుతో బెదిరింపులకు గురి చేశారన్నారు. దీనిపై సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.