
ఎస్సీలపై జరుగుతున్న దాడుల్లో ఆంధ్రప్రదేశ్ ముందుండడం దురదృష్టకరమని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఎస్సీల అణిచివేతను గాంధీ చూపిన అహింసాయుత మార్గంలోనే ఎదురిద్దామని ఆయన పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. సమాజంలో సమానత్వాన్ని సాధించి చూపడమే గాంధీజికి మనం అందించే నివాళి అని తెలిపారు. లాల్ బహదూర్‌శాస్త్రి స్ఫూర్తితో రైతు హక్కులను కాపాడుదామని తెలిపారు. రాజకీయాలంటే స్వార్థమెరుగకుండా ప్రజా సేవలో తరిచడమేనన్న మాటలను చంద్రబాబు గుర్తు చేశారు.