
ప్రముఖ ఉపాధ్యాయ ఉద్యమ నేత కొమ్మారెడ్డి కేశవరెడ్డి గురువారం మృతి చెందారు. అనారోగ్య కారణంగా ఆయన విజయవాడ మణిపాల్ ఆసుపత్రిలో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. గురువారం పరిస్థితి విషమించి కన్నుమూశారు. గుంటూరు జిల్లా గురజాలకు సమీపంలోని అంబాపురంలో కేశవరెడ్డి జన్మించారు. కళాశాల స్థయి నుంచే సాహిత్యం మీద ఉన్న అభిరుచితో ఆయన సాహిత్యం వైపు జీవితాన్ని మలుచుకున్నారు. సాహిత్య రంగానికి ఎనలేని క్రుషి చేశారు. దాదాపు 30 వరకు ప్రమాణిక గ్రంథాలను ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు. కేశవరెడ్డి ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ లో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు.