
తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా ముందుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిఘా విభాగాన్ని అలర్ట్ చేస్తుంటారు. నిఘా విభాగాన్ని ఏ స్థాయిలో ఎంత వరకు వినియోగించుకోవాలో అంత వరకు వాడుతుంటారు. అదే మిగిలిన ముఖ్యమంత్రులకు.. ఆయనకు మధ్య ఉన్న వ్యత్యాసం కూడా. అధికారం చేపట్టిన నాటి నుంచే ‘నిఘా’ విభాగాన్ని వాడడంలో ఆయనకు ఆయనే సాటి.
Also Read: జీహెచ్ఎంసీ ఎన్నికలు : బీజేపీ మేనిఫెస్టో విడుదల.. వరాలు ఇవే
నిఘా విభాగం ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంటూ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తుంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన బోలెడన్ని విషయాల్ని ఈ విభాగం అందిస్తుందని చెబుతారు. తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్లో ఏయే పార్టీలకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని.. ప్రతీ రెండు రోజులకోసారి నివేదిక ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.
గ్రేటర్‌లో బీజేపీ బలపడుతోందన్న మాట పలువురి నోట వినిపిస్తున్న వేళ.. తాజాగా కేసీఆర్ చేతికి అందిన నివేదికలోనూ బీజేపీ బలాన్ని ప్రస్తావించినట్లు చెబుతున్నారు. గతంతో పోలిస్తే.. గ్రేటర్‌లో బీజేపీ బలం పెరిగిందని.. గత ఎన్నికల (2016) మాదిరి గెలుపు కేక్ వాక్ కాదన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 99 సీట్ల సాధన.. సెంచరీ దాటేసే పరిస్థితి లేదని పేర్కొన్నట్లు చెబుతున్నారు.
Also Read: పీవీ, ఎన్టీఆర్‌లను వదలని ‘కాషాయ’ దండు
నిఘా విభాగం అంచనా ప్రకారం.. కనిష్ఠంగా 25 గరిష్ఠంగా 32 డివిజన్లను బీజేపీ సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. కాకుంటే.. బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలతో బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని.. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అలాంటి వ్యాఖ్యల్ని అస్సలు ఇష్టపడటం లేదన్న మాట నిఘా వర్గాలు తెలిపినట్లుగా చెబుతున్నారు. ఏదిఏమైనా ఎన్ని నిఘా విభాగాలు సర్వేలు చేసినా చివరికి తీర్పు ఓటరు చేతిలోనే ఉందనేది వాస్తవం. వారు ఎటు ఓటు వేయాలో ఇప్పటికే నిర్ణయానికి వచ్చి ఉంటారు. చూద్దాం మున్ముందు ఏం జరగబోతోందో..!
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
