బండ్ల గణేష్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరే. ఆయనో సినీ నటుడు.. నిర్మాత.. మాజీ పొలిటిషియన్ కూడా. ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. పొలిటికల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది కొద్ది రోజులుగా ప్రచారం నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఈసారి ఆయన బీజేపీలో చేరి హైదరాబాద్ కేంద్రంగా క్రియాశీలకంగా మారుతారని వార్తలు వచ్చాయి. కానీ.. ఆ ఊహాగానాలపై బండ్ల గణేష్ స్పందించారు.
Also Read: ‘ఆదిపురుష్’: ప్రభాస్ పారితోషికం.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్..!
తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టంచేశాడు. అంతేకాదు.. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేదని నిక్కచ్చిగా చెప్పేశారు. అయితే.. గణేష్ ఇలా ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. ఎప్పటికప్పుడు ఆయన సోషల్ మీడియా వేదికగా ఇక రాజకీయాలకు దూరమంటూ చెబుతూనే ఉంటాడు. పలు ఇంటర్వ్యూల్లోనూ రివీల్ చేశాడు.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్ కల్యాణ్ బీజేపీకి బహిరంగంగా మద్దతు తెలిపిన నేపథ్యంలో.. బండ్ల గణేష్ కూడా అదే బాటలో పయనిస్తారని, బీజేపీలో చేరుతారని ప్రచారం కొనసాగింది. దీంతో ఆయన తన పొలిటికల్ కెరీర్‌పై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాలకు శ్రీకారం చుట్టారు ఆయన. అధికార ప్రతినిధి హోదాలో హల్చల్ చేశాడు. ఎన్నో ఇంటర్వ్యూల్లో రచ్చరచ్చ కూడా చేశాడు.
Also Read: జబర్దస్త్ కమెడియన్ కు జలక్ ఇచ్చిన నాగబాబు.. బిగ్ బాస్ విన్నర్ అతడేనట?
ఈ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ గెలువకపోతే ‘7ఓ క్లాక్’ బ్లేడుతో గొంతు కోసుకుంటానని ఏకంగా సవాల్ విసిరాడు. ఆ డైలాగ్ అప్పట్లో బాగా వైరల్ అయింది కూడా. ఆ తర్వాత కాంగ్రెస్ ఓడిపోవడం, బండ్ల గణేశ్ తన సవాల్ నుంచి వెనక్కు తగ్గడం చకచకా జరిగిపోయాయి. తర్వాత కొన్నాళ్లకు తను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అప్పట్నుంచి ఈరోజు వరకు ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజా వ్యాఖ్యలతో ఇక ఆయన రాజకీయాల్లోకి రారు అనేది స్పష్టమైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్