అర్డినెన్స్ ను తిరస్కరించండి: గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖ

ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య అంతర్యుద్ధం జరుగుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ కు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ శనివారం లేఖ రాశారు. స్థానిక ఎన్నికలపై అసెంబ్లీ తీర్మానం విరుద్దమని, రాజ్యాంగంలోని 243కే అధికరణ కింద ఎన్నికల కమిషన్ కు స్వయం ప్రతిపత్తి ఉందని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఐదేళ్లకోసారి ఎన్నికలు జరపడం కమిషన్ విధి అని, ఆ అధికారాలు కమిషన్ కు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం సమ్మతితో ఎన్నికలు […]

Written By: Suresh, Updated On : December 5, 2020 2:30 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య అంతర్యుద్ధం జరుగుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ కు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ శనివారం లేఖ రాశారు. స్థానిక ఎన్నికలపై అసెంబ్లీ తీర్మానం విరుద్దమని, రాజ్యాంగంలోని 243కే అధికరణ కింద ఎన్నికల కమిషన్ కు స్వయం ప్రతిపత్తి ఉందని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఐదేళ్లకోసారి ఎన్నికలు జరపడం కమిషన్ విధి అని, ఆ అధికారాలు కమిషన్ కు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం సమ్మతితో ఎన్నికలు జరుపాలన్న నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, అలాంటి అర్డినెన్స్ వస్తే తిరస్కరించండని గవర్నర్ ను కోరారు.