జీహెచ్ఎంసీ కౌంటింగ్: జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు

తెలంగాణ ఎన్నికల కమిషనర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆపేసిన జీహెచ్ఎంసీ డివిజన్ కౌంటింగ్ ను సాగాలే చేద్దామనుకున్న ఆయన ప్రయత్నాలకు బ్రేక్ పడింది.ముద్రల ఓట్లపై గందళగోళం నేపథ్యంలోనే నేరెడ్ మెట్ లో ఫలితం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టుకు ఎక్కారు. Also Read: వరదసాయం చేసినా బురదే మిగిలిందా? ముద్రల ఓట్ల విషయంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఎస్ఈసీ హైకోర్టులో అప్పీల్ చేశాడు. అయితే ఎస్ఈసీ అప్పీలుపై విచారణ జరిపిన […]

Written By: NARESH, Updated On : December 5, 2020 3:46 pm
Follow us on

తెలంగాణ ఎన్నికల కమిషనర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆపేసిన జీహెచ్ఎంసీ డివిజన్ కౌంటింగ్ ను సాగాలే చేద్దామనుకున్న ఆయన ప్రయత్నాలకు బ్రేక్ పడింది.ముద్రల ఓట్లపై గందళగోళం నేపథ్యంలోనే నేరెడ్ మెట్ లో ఫలితం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టుకు ఎక్కారు.

Also Read: వరదసాయం చేసినా బురదే మిగిలిందా?

ముద్రల ఓట్ల విషయంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఎస్ఈసీ హైకోర్టులో అప్పీల్ చేశాడు. అయితే ఎస్ఈసీ అప్పీలుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. నేరెడ్ మెట్ లో ఫలితం నిలిచిపోవడానికి సిబ్బందికి శిక్షణ లోపమే కారణమని హైకోర్టు అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి వద్ద సోమవారమే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది.

సింగల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక అభ్యంతరం ఉంటే అప్పీలు చేయాలని హైకోర్టు పేర్కొంది. సోమవారం ఉదయం మొదట ఈ అంశమే విచారణ జరపాలని సింగిల్ జడ్జికి ఆదేశాలు జారీ చేసింది.

Also Read: జీహెచ్ఎంసీ ఎన్నికలపై యోగీ ఆసక్తికర ట్వీట్..!

గ్రేటర్ ఎన్నికల వేళ కౌంటింగ్ పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. బీజేపీ అభ్యంతరాలతో పలు డివిజన్లలో ఎన్నికల కౌంటింగ్ నిలిచిపోయింది. ఇక పోలైన ఓట్లకు.. లెక్కింపులో తేడా రావడంతో చాలా చోట్ల గందరగోళం నెలకొంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్