https://oktelugu.com/

కార్పొరేటర్లను నడిబజార్లో నిలబెడుతానంటూ ఎంఐఎం నేత వార్నింగ్..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోగానీ.. ప్రత్యేక తెలంగాణలోగానీ సీఎంగా ఎవరున్న పాతబస్తీలో మాత్రం ఎంఐఎందే హవా. ఎంఐఎం పార్టీ హైదరాబాద్లో తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. ఐదేళ్లకోసారి జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో క్రమంగా తన సీట్లను సంఖ్యను పెంచుకుంటూ పోతుంది. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసింది దాదాపు 50స్థానాలే అయినా 44సీట్లను గెలుచుకుంది. తక్కువ స్థానాల్లో పోటీచేసినా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్.. బీజేపీ.. కాంగ్రెస్ లకు ధీటుగా ఎంఐఎం సీట్లను సాధించడం గమనార్హం. టీఆర్ఎస్ కు 56.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 14, 2020 / 03:55 PM IST
    Follow us on

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోగానీ.. ప్రత్యేక తెలంగాణలోగానీ సీఎంగా ఎవరున్న పాతబస్తీలో మాత్రం ఎంఐఎందే హవా. ఎంఐఎం పార్టీ హైదరాబాద్లో తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. ఐదేళ్లకోసారి జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో క్రమంగా తన సీట్లను సంఖ్యను పెంచుకుంటూ పోతుంది.

    2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసింది దాదాపు 50స్థానాలే అయినా 44సీట్లను గెలుచుకుంది. తక్కువ స్థానాల్లో పోటీచేసినా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్.. బీజేపీ.. కాంగ్రెస్ లకు ధీటుగా ఎంఐఎం సీట్లను సాధించడం గమనార్హం.

    టీఆర్ఎస్ కు 56.. బీజేపీకి 48.. ఎంఐఎం కు 44.. కాంగ్రెస్ కు 2 స్థానాలు దక్కడంతో హంగ్ ఏర్పడింది. టీఆర్ఎస్.. బీజేపీలకు మేయర్ పీఠం దక్కాలంటే తప్పసరిగా ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

    వివాదాలకే కేరాఫ్ నిలిచే అక్బరుద్దీన్ ఒవైసీ తాజాగా ఎంఎంఐఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీలో కొత్తగా ఎన్నికైన ఎంఐఎం కార్పొరేటర్లు.. పార్టీ కార్యకర్తలతో నేడు ఫలక్ ప్యాలస్ ఫంక్షన్ హాల్లో విజయోత్సవ సభను నిర్వహించారు.

    ఈ కార్యక్రమంలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఎంఐఎం కార్పొరేటర్ పదవిని అడ్డుపెట్టుకుని వేధింపులకు గురిచేయడం.. డబ్బు వసూళ్లకు పాల్పడితే కాలర్ పట్టుకుని నడి బజారులో నిలబెడతానంటూ హెచ్చరించారు. కార్పొరేటర్లు గెలువడం దేవుడిచ్చిన వరమని దీనిని ప్రజాసేవకే వినియోగించుకోవాలని సూచించారు.

    ఇక చాంద్రాయణగుట్ట ప్రాంతం తన రక్తం చిందిన నేల అని.. ఈ ప్రాంతంపై తనకు ఎంతో మక్కువ ఉందన్నారు. అనంతరం చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో గెలుపొందిన కార్పొరేటర్లను ఆయన సన్మానించారు.