
బైక్ అదుపుతప్పి ఫ్లైఓవర్ రెయిలింగ్ను ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాతంరాయి సమీపంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. శంషాబాద్‌కు చెందిన సతీశ్ (25) బైక్‌పై (టీఎస్ 07 జీఎం 0352) ఉదయం సాతంరాయి ప్రాంతానికి వెళ్లాడు. కాసేపు స్నేహితులతో గడిపి విధులకు హాజరయ్యేందుకు శంషాబాద్ బయల్దేరాడు. జాతీయ రహదారి 44పై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో చువ్వలు శరీరంలో దిగి ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.