
కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కన్నుమూశారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో మృతి చెందారు. కరోనాతో గత నెల(డిసెంబర్) 13న ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన కన్నుమూశారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో చల్లా రామకృష్ణారెడ్డికి విశిష్టమైన స్థానం ఉంది. ఆయన స్వగ్రామం అవుకు మండలం ఉప్పలపాడు. తండ్రి చల్లా చిన్నపురెడ్డి. కుమారులు చల్లా భగీరథరెడ్డి, చల్లా విఘ్నేశ్వరరెడ్డి, కుమార్తెలు బృంద, పృథ్వీ. ఈయన 1983లో పాణ్యం ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1989లో డోన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.