Telugu News » Ap » Polavaram will be completed by the end of 2021
Ad
2021 చివరి నాటికి పోలవరం పూర్తి
2021 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం పోలవరం కాపర్ డ్యాం పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 2014 తరువాత పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించిందన్నారు. దీంతో ఈ ప్రాజెక్టకు కేంద్రం నిధుల మంజూరుకు సహకరిస్తారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ టీడీపీ చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. కమీషన్ల కోసమే గత ప్రభుత్వం పోలవరాన్ని […]
2021 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం పోలవరం కాపర్ డ్యాం పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 2014 తరువాత పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించిందన్నారు. దీంతో ఈ ప్రాజెక్టకు కేంద్రం నిధుల మంజూరుకు సహకరిస్తారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ టీడీపీ చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. కమీషన్ల కోసమే గత ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేయలేదన్నారు. రూ.50 వేల కోట్లలో 30 వేల కోట్లు ఉన్న ఆర్అండ్ ఆర్ గురించి పట్టించుకోలేదని టీడీపీపై విమర్శలు చేశారు.