NTR fans protest: రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరినీ కలుపుకుంటూ పోవాలి, గెలుక్కుంటూ కాదు, పవర్ లో ఉన్నాము కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టమొచ్చినవి చేయడం వంటివి చేస్తే గత వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి గతి పట్టిందో, మిగతా వాళ్లకి కూడా అదే గతి పడుతుంది. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే కూటమి పార్టీ లోని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్(Daggubati Venkateswara Prasad) ‘వార్ 2′(War 2 Movie) చిత్రానికి బెనిఫిట్ షోస్ వేయరాదని, వేస్తె బాగుండదని, ఎట్టి పరిస్థితిలో ఆ సినిమాని ఆపేయాలి అంటూ అనంతపురం TNSF అధ్యక్షుడు గుత్తా ధనుంజయ నాయుడు తో జరిపిన ఒక ఫోన్ కాల్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై సెన్సేషనల్ గా మారింది. దీంతో ఎన్టీఆర్(Junior NTR) అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియా లో నెగిటివ్ కామెంట్స్ చేయడం కాదు, నీరు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిపోయారు.
అక్కడికి వెళ్లి ఎమ్మెల్యే కి సంబంధించిన బ్యానర్స్ ని చింపివేసి, వందలాది మందితో కూర్చొని ధర్నా చేయడం మొదలు పెట్టారు. అయితే అంతకు ముందే సోషల్ మీడియా లో వీడియో వైరల్ అవ్వడం తో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందిస్తూ ‘నందమూరి ఫ్యామిలీ అన్నా, నారా ఫ్యామిలీ అన్నా నాకు ఎంతో అభిమానం, సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఆడియో నిజం కాదు, నా గొంతుని AI ద్వారా మార్చి వైసీపీ పార్టీ శ్రేణులు కావాలని డబుల్ గేమ్స్ ఆడుతున్నారు. కానీ అభిమానుల మనసులు నొచ్చుకున్నాయి కాబట్టి వాళ్లకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను’ అంటూ ఒక వీడియో ని విడుదల చేసాడు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఏమాత్రం సరిపోలేదు. నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ధర్నాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
కానీ లాజికల్ గా ఆలోచిస్తే, ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం లో సినిమాని ఆఆపాలని అనుకుంటే క్షణం పని, పైన నుండి ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా గ్రౌండ్ లెవెల్ లో రాజకీయాలు జరిపించి సినిమాలను ఆపేయొచ్చు. కానీ ‘వార్ 2’ కి అలాంటివి జరగలేదు . చాలా ప్రశాంతంగా అనంతపురం ‘వార్ 2’ బెనిఫిట్ షోస్ ప్రదర్శితమయ్యాయి. మరి అలాంటప్పుడు ఈ ఆడియో నిజంగా ఫేక్ నా?, రీసెంట్ గానే మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించారు. దీనికి జనాల నుండి అపూర్వమైన స్పందన వస్తుంది, దీంతో ప్రభుత్వం పై విమర్శలు చేసే అంశం దొరక్కపోవడం తో కావాలనే ఈ వివాదం సృష్టించి రసాభాస చేస్తున్నారని, ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ధర్నా చేస్తున్న వాళ్ళు కూడా వైసీపీ కి సంబంధించిన వాళ్ళే అని టీడీపీ వాదన. మరి ఈ ఆడియో నిజామా కాదా అనేది ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ద్వారానే తెలుస్తుంది.
Prabhas fans aythe pakana vuna fast food lo per person oka egg fried rice free ante side aipoyevalu emo
Kani NTR fans ala kadhu ga
— Syera (@NeelFannn) August 17, 2025