
సూపర్‌స్టార్ రజినీకాంత్ అస్వస్థతపై ట్విట్టర్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాని చెప్పారు. శుక్రవారం ఉదయం రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో రజినీకాంత్‌కు చికిత్స కొనసాగుతోంది. రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన చెందొద్దని అపోలో వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని తెలిపారు. ఈరోజు రాత్రికి వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని చెప్పారు. రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తారని వైద్యులు తెలిపారు.