https://oktelugu.com/

ఈ టైమ్ లో అంత బలుపు అవసరమా రవితేజా!

కాలం మనది కానప్పుడు కొంచం తగ్గడంలో తప్పేమి లేదు. అలా కాదని మూర్ఖంగా ముందు వెళితే చేదు అనుభవాలు ఎదురుకావడం ఖాయం. ప్రస్తుతం రవితేజకు ఈ సిట్యుయేషన్ చక్కగా సరిపోతుంది. రవితేజ మొండిపట్టుదల వలన మంచి ప్రాజెక్ట్ చేజార్చుకున్నారన్న వార్త వినిపిస్తుంది. విషయంలోకి వెళితే దర్శకుడు మారుతీ… రవితేజతో ఒక మూవీ ప్లాన్ చేయగా ఆయన నటించడానికి ఒప్పుకున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ టు, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాల్సి ఉంది. కాగా ఈ ప్రాజెక్ట్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 25, 2020 / 07:35 PM IST
    Follow us on


    కాలం మనది కానప్పుడు కొంచం తగ్గడంలో తప్పేమి లేదు. అలా కాదని మూర్ఖంగా ముందు వెళితే చేదు అనుభవాలు ఎదురుకావడం ఖాయం. ప్రస్తుతం రవితేజకు ఈ సిట్యుయేషన్ చక్కగా సరిపోతుంది. రవితేజ మొండిపట్టుదల వలన మంచి ప్రాజెక్ట్ చేజార్చుకున్నారన్న వార్త వినిపిస్తుంది. విషయంలోకి వెళితే దర్శకుడు మారుతీ… రవితేజతో ఒక మూవీ ప్లాన్ చేయగా ఆయన నటించడానికి ఒప్పుకున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ టు, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాల్సి ఉంది. కాగా ఈ ప్రాజెక్ట్ చేయాలంటే రవితేజ తన రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలకు నాలుగు ఆప్షన్స్ ఇచ్చారట.

    Also Read: మహేష్ కోసం హైదరాబద్ లో ‘అమెరికా బ్యాంక్’.. !

    మొదటి ఆప్షన్ గా తనకు రూ. 12కోట్లు సింగిల్ పేమెంట్లో ఇచ్చేయాలి. అలా కాదంటే రూ. 10కోట్ల పేమెంట్ తో పాటు 20% లాభాల్లో వాటా అడిగారట. ఇక మూడవ ఆప్షన్ గా 13కోట్లు రెమ్యూనరేషన్… రెండు విడతలుగా ఇవ్వాలని చెప్పారట. నిర్మాతలకు రవితేజ ఇచ్చిన చివరి ఆప్షన్ ఏమిటంటే… సినిమా పూర్తి అయిన తరువాత తాను చెప్పిన పర్సెంటేజ్ రెమ్యూనరేషన్ గా ఇవ్వాలి. రవితేజ ఇచ్చిన ఈ నాలుగు ఆప్షన్స్ నిర్మాతలకు నచ్చలేదట. దీనితో మారుతీ దర్శకత్వంలో రవితేజ మూవీని వాళ్ళు హోల్డ్ లో పెట్టారట. చేసేదేమీ లేక దర్శకుడు మారుతీ వేరే హీరోని వెతికే పనిలో పడ్డారట.

    Also Read: డే 1 సాలిడ్ వసూళ్లు రాబట్టిన “సోలో బ్రతుకే సో బెటర్”.!

    రవితేజ క్లీన్ హిట్ అందుకుని ఏళ్ళు గడిచిపోతుంది. ఆయన మూస కామెడీ అండ్ యాక్టింగ్ జనాలకు బోర్ కొట్టేసింది. రవితేజ సినిమా విడుదల అవుతుందంటే ఎగబడి థియేటర్స్ కి వెళ్లే రోజులు ఎప్పుడో పోయాయి. వరుస పరాజయాలు రవితేజ మార్కెట్ ని దెబ్బతీశాయి. అలాంటి రవితేజ హిట్ డైరెక్టర్ మారుతీతో సినిమా అవకాశం వదులుకోవడం, తెలివితక్కువ పనే. ఎంటర్టైనింగ్ దర్శకుడిగా మినిమమ్ గ్యారంటీ హిట్ చిత్రాలు తీస్తున్న మారుతీ రవితేజకు మంచి కమ్ బ్యాక్ ఇవ్వొచ్చు. ఆయన గత చిత్రం ప్రతిరోజూ పండగే భారీ హిట్ కొట్టింది. ఇక యూవీ, గీతా 2కూడా అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా మంచి హిట్ ట్రాక్ కలిగి ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ జనాలు… మొండితనానికి పోయి రవితేజ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అంటున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్