పశ్చిమ బెంగాల్ లో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని భగత్ సింగ్ కాలనీ, రవీంద్రనగర్, బుచ్చిరెడ్డిపాలెంలో వరదనీరు భారీగా చేరింది. భారీ వర్షాలనికి మాగుంట లే ఔట్ లో అండర్ బ్రిడ్జి కింద ప్రవహించిన నీటిలో ఆర్టీసీ బస్సు ఇరుక్కుపోయింది. భారీ వర్షాలకు అస్తవ్యస్తమైన పలు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటించారు. రైల్వే పనుల వల్లే ఈ పరిస్థితి ఎదురైందని, కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకోకుండా పనులు చేయడంతోనే ఈ దుస్థతికి వచ్చిందన్నారు.