తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం వేలాది మంది బలిదానం చేశారు. ఢిల్లీ పెద్దలు కళ్లు తెరవాలని అక్కడి వెళ్లి మరీ ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఆ స్థాయిలో రగిల్చారు. అన్ని బలిదానాలు.. అన్ని పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ.. రాష్ట్రం ఏర్పడ్డాక సామాన్యులకు ఏపాటి మేలు జరిగిందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
Also Read: రైతులకు శుభవార్త: ఆ ‘స్కీమ్’తో అదిరిపోయే రాబడి!
కానీ.. ఇప్పుడు తాజాగా తెలంగాణ రాజకీయ ఆత్మహత్యలు జరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికలు.. ఇద్దరు కార్యకర్తల ప్రాణాలు బలితీసుకున్నారు. వారిలో ఒకరు బీజేపీ కార్యకర్త, మరొకరు టీఆర్ఎస్ కు చెందిన కార్యకర్త. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచార దశలో బీజేపీ నేత బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేయగా, ఆయనను తక్షణం విడుదల చేయాలంటూ బీజేపీకి చెందిన కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలై చికిత్స పొందుతూ మరణించాడు.
ఉప ఎన్నికల సమయాల్లో నేతల అరెస్టులు, విడుదల మామూలే. దాని కోసం ఒక వ్యక్తి తన ప్రాణాలను తీసుకున్నారు. విజయం బీజేపీని వరించిన నేపథ్యంలో ఈ విజయాన్ని ఆ కార్యకర్తకు అంకితం ఇచ్చినట్టుగా తెలంగాణ బీజేపీ ప్రకటించింది. అయితే.. ఈ విజయంతో పోయిన వ్యక్తి ప్రాణాలైతే తిరిగి రావు కదా. ఇక దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోయిందని మరో కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన అంత్యక్రియలకు టీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు హాజరై పాడె మోశారు.
Also Read: విశాఖ రాజధాని: కీలక విజయాన్ని సాధించిన సీఎం జగన్
అయితే.. ఒక్క ఉప ఎన్నికతో ప్రభుత్వం పడిపోయేది లేదు. కానీ.. సామాన్య కార్యకర్తలు మాత్రం బలైపోతున్నారు. ఆత్మహత్యలతో సాధించేది కూడా ఏం లేదు. రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకోవడమే చింతించాల్సిన అంశం.. అలాంటిది రాజకీయం కోసం ఆత్మహత్యలు జరగడం మరింత విషాదకరం. రాష్ట్రంలో ఈ తీరుకు నేతలే ఫుల్‌స్టాప్ పెట్టాలి. వారే కార్యకర్తల్లో మనోధైర్యం నింపాలి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్