https://oktelugu.com/

డిజిటల్ మీడియాపై కేంద్రం ఫోకస్.. అశ్లీలతను అడ్డుకునేందుకేనా?

కేంద్ర ప్రభుత్వం డిజిజల్ మీడియాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆన్ లైన్లో విశృంఖలంగా పెరిగిపోతున్న అశ్లీలతను అడ్డుకునేందుకు తాజాగా చర్యలు తీసుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆన్ లైన్ ఛానల్స్.. వెబ్ సైట్స్.. యూట్యూబ్.. ఓటీటీలను సమాచార పరిధిలోకి తీసుకొచ్చింది. Also Read: జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదా? ఆన్ లైన్స్ ఛానల్స్.. వెబ్ సైట్స్ ను సమాచార పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఇకపై ఎవరుపడితే వీటినే ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉండదు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 4:46 pm
    Follow us on

    Digital Media

    కేంద్ర ప్రభుత్వం డిజిజల్ మీడియాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆన్ లైన్లో విశృంఖలంగా పెరిగిపోతున్న అశ్లీలతను అడ్డుకునేందుకు తాజాగా చర్యలు తీసుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆన్ లైన్ ఛానల్స్.. వెబ్ సైట్స్.. యూట్యూబ్.. ఓటీటీలను సమాచార పరిధిలోకి తీసుకొచ్చింది.

    Also Read: జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదా?

    ఆన్ లైన్స్ ఛానల్స్.. వెబ్ సైట్స్ ను సమాచార పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఇకపై ఎవరుపడితే వీటినే ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉండదు. వీటిని కూడా కేంద్రం నిబంధనలు వర్తించనుండటంతో ఈ ప్లాట్ ఫామ్స్ కూడా మీడియా ప్రయోజనాలు కలుగనున్నాయి. ఆన్‌లైన్ ఛానెల్స్ ఏర్పాటుకు లైసెన్సింగ్ విధానం తీసుకురావడం ద్వారా ఈ రంగంలోనూ విదేశీ పెట్టుబడులకు అవవకాశాలు కలుగనున్నాయి.

    Also Read: బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ లింక్ చేశారా.. లేదంటే లక్షల్లో నష్టం..?

    డిజిటల్ మీడియాలో విద్వేషం.. ఉగ్రవాదం.. హింస.. అశ్లీలత పెరిగిపోతుందంటూ కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ఈమేరకు కేంద్రం డిజిటల్ మీడియా కట్టడిలో భాగంగా గతేడాది న్యూస్ వెబ్ సైట్లను అధికారిక నియత్రణ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    ముందుగా వెబ్ ఆధారిత మీడియాను కోర్టు నియంత్రించాలని కోర్టు సూచించింది. దీంతోపాటు ఎలక్ట్రానిక్‌ మీడియాకు సంబంధించిన నిబంధనలను రూపొందించే అంశాన్ని పార్లమెంట్‌కు వదిలేయాలని కోరింది. దీనిలో భాగంగా కేంద్రం డిజిటల్ మీడియాను కట్టడి చేసేందుకు.. అశ్లీలతను నివారించేందుకు ఓటీటీ కంటెంట్లను.. యూట్యూబ్ ఛానళ్లను సమాచారం పరిధిలోకి తీసుకొచ్చినట్లు కేంద్రం స్పష్టం చేసింది.