తిరుమలలో త్వరలో శ్రీవారి భక్తుల సంఖ్యను పెంచుతామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.వారం రోజులుగా సాగుతున్న బ్రహ్మూెత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి. శనివారం నిర్వహించిన చక్రస్నానంతో బ్రహ్మూెత్సవాలు ముగిసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానాన్ని ఘట్టాన్ని అర్చకులు పూర్తి చేశారు. కరోనా నిబంధనలతో బ్రహ్మూెత్సవాలను వైభవంగా నిర్వహించామని, పరిమిత సంఖ్యలో భక్తులను ఆహ్వానించామని అధికారులు తెలిపారు.