తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎంసెట్‌

కోవిడ్‌ నిబంధనలతో నేటి నుంచి మెడికల్‌, అగ్రికల్చర్‌లో ప్రవేశానికి ఎంసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో రెండు విడతల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్‌లో 17, తెలంగాణలో 67 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద శానిటైజర్‌లను ఏర్పాటు చేశామని, భౌతిక దూరం పాటించి పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రాల నిర్వాహకులు తెలుపుతున్నారు. కాగా ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించే ఎంసెట్‌కు విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి రావాలని […]

Written By: NARESH, Updated On : September 28, 2020 8:37 am

students

Follow us on

కోవిడ్‌ నిబంధనలతో నేటి నుంచి మెడికల్‌, అగ్రికల్చర్‌లో ప్రవేశానికి ఎంసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో రెండు విడతల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్‌లో 17, తెలంగాణలో 67 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద శానిటైజర్‌లను ఏర్పాటు చేశామని, భౌతిక దూరం పాటించి పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రాల నిర్వాహకులు తెలుపుతున్నారు. కాగా ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించే ఎంసెట్‌కు విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి రావాలని కోరారు.