
ఏలూరు ఘటనపై కమిటీ వేసి సీఎం జగన్ చేతులు దులుపుకొన్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు. సీఎంలో నాయకత్వ నైపుణ్యం, పాలన దక్షత లోపించాయని విమర్శించారు. ఎల్జీ పాలిమర్స్ బాధితుల మాదిరే ఏలూరు బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాలు దాచడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.