
కరోనా కారణంగా నష్టపోయిన సినీ పరిశ్రమపై వరాలు కురిపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కి సూపర్ స్టార్ మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. సీఎం తన నిర్ణయంతో లాక్‌డౌన్ కారణంగా ఇండస్ట్రీలో ఏర్పడిన శూన్యాన్ని పూడ్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఆపత్కాలంలో పరిశ్రమకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చొరవతో మూవీ ఇండస్ట్రీకి జవసత్వాలు చేకూరుతాయన్నారు. ఈ మేరకు మహేష్ బాబు ట్వీట్ చేశారు.