https://oktelugu.com/

రామతీర్థం: పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట

విజయనగరం జిల్లా రామతీర్థంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లిమర్ల జంక్షన్ వద్ద గురువారం బీజేపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. రామతీర్థం కొండపైకి ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలపగా అందరినీ అనుమతించాలని బీజేపీ నాయకులు పట్టుబట్టారు. దీంతో ఇరు పక్షాల మధ్య జరిగిన తోపులాటలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్షువర్దన్ సొమ్మసిల్లి పడిపోయారు. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Written By: , Updated On : January 7, 2021 / 10:45 AM IST
BJP
Follow us on