https://oktelugu.com/

ఇంటెలిజెన్స్‌ రిపోర్టులో టీఆర్‌‌ఎస్‌కు షాక్‌?

రాజకీయాల్లో అలకలు సాధారణం. అయితే.. ఆ అలకలు కూడా ఒక్కోసారి సొంత పార్టీకి తీరని నష్టాన్నే తెచ్చిపెడుతుంటాయి. వారి వైఖరి.. వారి పట్టింపు మరో పార్టీకి మేలు చేస్తుంటాయి. వారు అదే కోరుకుంటూ ఉంటారు. అయితే.. సరిగా ఇలానే జరిగింది ఓ టీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్యే విషయంలో. ఆ ఎమ్మెల్యే అధినాయకత్వానికి చాలా సన్నిహితుడు. కానీ.. ఆయన మాట కాదని కొందరికి టికెట్లు ఇచ్చింది ఆ పార్టీ.దీంతో తనకు నచ్చని అభ్యర్థుల వైపు ఆయన కన్నెత్తి కూడా చూడడం […]

Written By:
  • NARESH
  • , Updated On : November 27, 2020 / 11:21 AM IST
    Follow us on

    రాజకీయాల్లో అలకలు సాధారణం. అయితే.. ఆ అలకలు కూడా ఒక్కోసారి సొంత పార్టీకి తీరని నష్టాన్నే తెచ్చిపెడుతుంటాయి. వారి వైఖరి.. వారి పట్టింపు మరో పార్టీకి మేలు చేస్తుంటాయి. వారు అదే కోరుకుంటూ ఉంటారు. అయితే.. సరిగా ఇలానే జరిగింది ఓ టీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్యే విషయంలో. ఆ ఎమ్మెల్యే అధినాయకత్వానికి చాలా సన్నిహితుడు. కానీ.. ఆయన మాట కాదని కొందరికి టికెట్లు ఇచ్చింది ఆ పార్టీ.దీంతో తనకు నచ్చని అభ్యర్థుల వైపు ఆయన కన్నెత్తి కూడా చూడడం లేదు. అంతేకాదు.. మిగిలిన వారి గెలుపు కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు.

    Also Read: హీటెక్కిస్తున్న గ్రేటర్‌‌ సమరం.. ఎవరికి మొగ్గు ఉంది?

    జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. గ్రేటర్‌లో గెలుపు సునాయాసమని భావించిన పార్టీకి క్షేత్రస్థాయిలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది పార్టీ అభ్యర్థులకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతోంది. కొంతమంది అయితే వారిని అసలు పట్టించుకోవడం లేదు. ప్రచారం కూడా చేయడం లేదు. మరికొందరు పార్టీ అభ్యర్థులను విసుక్కోవడం, ఖర్చు చేయడం లేదంటూ తరచూ ఆగ్రహం వ్యక్తం చేయడం వంటివి చేస్తున్నారు. సదరు డివిజన్‌ ఇన్‌చార్జీలకూ సహకరించడం లేదు. బూత్‌ ఏజెంట్ల విషయంలోనూ పేచీలు పెడుతున్నారు.

    ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. కొందరు లోపాయికారీగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఫలితంగా, వందకుపైగా స్థానాల్లో గెలుపు ఖాయమని అధికార పార్టీ నేతలు పైకి చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. గ్రేటర్‌ ఎన్నికలకు నెలల ముందే కసరత్తు మొదలు పెట్టి.. పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగామని భావిస్తున్న అధినాయకత్వానికి సొంత నేతల నుంచే ఎదురవుతున్న సవాళ్లు షాకింగ్‌గా మారాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార పార్టీ ముందు నుంచే ఆచితూచి వ్యవహరించింది. సంబంధిత ఎమ్మెల్యేల ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడంతోపాటు.. స్థానిక అంశాలపై నాలుగైదు నివేదికలు తెప్పించుకొని మరీ అభ్యర్థుల్ని ఎంపిక చేసింది.

    Also Read: తిరుపతి సీటుపై జగన్‌ స్పెషల్‌ ఫోకస్‌

    అన్నింటికీ ఓకే చెప్పిన వారు.. తీరా ఎన్నికల వేళ అనుసరిస్తున్న వైఖరి పార్టీ అధినాయకత్వానికి మింగుడు పడడం లేదు. గ్రేటర్‌ పరిధిలోని ప్రతి డివిజన్‌ బాధ్యతను కొందరు ఇన్‌చార్జీలకు అప్పగించిన విషయం తెలిసిందే. ఒక్కో డివిజన్‌కు కనిష్ఠంగా ఒకరు.. గరిష్ఠంగా నలుగురిని ఎంపిక చేశారు. డివిజన్ల గెలుపోటముల బాధ్యత నగరంలోని ఎమ్మెల్యేలకు అప్పజెప్పారు. తాజాగా.. ఇంటెలిజెన్స్‌ ఇచ్చిన నివేదిక పార్టీకి తలనొప్పిలా మారింది. ‘‘ఓవైపు ప్రత్యర్థులు పుంజుకుంటుంటే.. మరోవైపు మనోళ్లు పేచీలతో విలువైన కాలాన్ని గడిపేస్తున్నారు. ఇలా అయితే, భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది’’ అని నివేదించినట్లు సమాచారం. దాంతో అధినాయకత్వం అప్రమత్తమైనట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, అభ్యర్థుల మధ్య పెరిగిన దూరం పార్టీకి చేటుగా మారడమే కాకుండా 20 నుంచి 25 సీట్ల ఫలితంపై ప్రభావం చూపుతుందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో టీఆర్‌‌ఎస్‌ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలిసింది. సహకారం ఇవ్వని ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేసి క్లాస్‌ ఇచ్చినట్లు సమాచారం.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్