https://oktelugu.com/

బిగ్ బాస్ హౌస్‌ లో ప్రేమలు ఎక్కువ కాలం ఉండవు !

బిగ్ రియాలిటీ షో  బిగ్ బాస్ షోకు వెళ్లకముందే  సింగర్ రాహుల్, బబ్లీ బ్యూటీ  శ్రీముఖి మంచి స్నేహితులు అట. కానీ బిగ్ బాస్ షో ఈ ఇద్దరి మధ్య కాస్త దూరం పెంచింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు   ఈ ఇద్దరూ  బద్ద శత్రువులుగా మారారు. మొదట్లో సరదాగా సాగిన వీరి బంధం ఆ తరువాత కాస్త ముదిరింది.  ఒక విధంగా   శ్రీముఖి శత్రుత్వమే రాహుల్‌ను విజేతగా నిలబెట్టిందని కూడా కామెంట్స్ వినిపించాయి అంటే..  వీరి మధ్య నడిచిన డ్రామా ఏ రేంజ్ లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 26, 2020 6:17 pm
    Follow us on

    బిగ్ రియాలిటీ షో  బిగ్ బాస్ షోకు వెళ్లకముందే  సింగర్ రాహుల్, బబ్లీ బ్యూటీ  శ్రీముఖి మంచి స్నేహితులు అట. కానీ బిగ్ బాస్ షో ఈ ఇద్దరి మధ్య కాస్త దూరం పెంచింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు   ఈ ఇద్దరూ  బద్ద శత్రువులుగా మారారు. మొదట్లో సరదాగా సాగిన వీరి బంధం ఆ తరువాత కాస్త ముదిరింది.  ఒక విధంగా   శ్రీముఖి శత్రుత్వమే రాహుల్‌ను విజేతగా నిలబెట్టిందని కూడా కామెంట్స్ వినిపించాయి అంటే..  వీరి మధ్య నడిచిన డ్రామా ఏ రేంజ్ లో ఉండి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.  అందుకే బిగ్ బాస్ హౌస్ బయటకు వచ్చాక  కూడా రాహుల్ శ్రీముఖి ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు.

    Also Read: బిగ్ సిక్రెట్ రిలీవ్ చేసిన రాహుల్ సింప్లిగంజ్..!

    కాగా  బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లు ఎన్ని పార్టీలు చేసుకున్నా కూడా,  శ్రీముఖి మాత్రం హాజరు కాలేదు, కారణం అక్కడ తనకు నచ్చిన వ్యక్తులు కొంతమంది ఉన్నారట. వారిలో రాహుల్ ముఖ్యమైన వ్యక్తి అట.   అయితే తాజాగా శ్రీముఖితో ఉన్న రిలేషన్ గురించి రాహుల్ తన మనసులో మాటను బయట పెట్టాడు.  శ్రీముఖిని నేను వదిలేయలేదు. ప్రొఫెషనల్ పరంగా  మేము ఇద్దరం కలిసే ఉన్నాం.  రీసెంట్‌గానే మేము కలిసి ఒక ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది.  ఇప్పటికి  మా మధ్య మంచి రిలేషన్ ఉంది.. గొడవలేం లేవు. అనవసరంగా మా గురించి నెగిటివ్ గా రాయకండి.

    Also Read: బిగ్ బాస్ హౌస్ లో మరో ప్రేమజంట !

    అయినా మీ అందరికీ ఓ విషయం చెప్పాలి.  బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు.. ప్రేమలు ఎక్కువ కాలం ఉండవు అని మొత్తానికి  రాహుల్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. పైగా  హౌస్ లో  మొదలైన ప్రేమ పెళ్లి వరకు వెళ్లినా కాపురం నిలబడదని కూడా తేల్చి  చెప్పేశాడు. మరి ఈ మాటను మనోడు ఎవర్ని ఉద్దేశించి చెప్పాడో. ఇక తన లైఫ్‌లో కూడా  ప్రేమకథలు చాలా ఉన్నాయని కూడా  రాహుల్  బాబు చెప్పుకొచ్చాడు. మరి ఆయనగారు  తన  ప్రేమ కథలు గురించి అప్రస్తుతంగా ఎందుకు చెప్పాడో ఆయనకే తెలియాలి.  అలాగే బాబు  తన దృష్టిలో ప్రేమకథ అంటే మనిషిని మనిషి ప్రేమించడం  అని ఏదేదో చెప్పాడు.  


    మరిన్ని సినిమా వార్తల కోసం:టాలీవుడ్ న్యూస్