
ఏపీ సీఎం జగన్, సుప్రీం న్యాయ మూర్తుల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఆసక్తికరంగా సాగుతోంది. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జస్జిస్ ఎస్వీ రమణపై ఆరోపణలు చేస్తూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖ అంశాన్ని ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం మీడియాకు తెలిపారు. అయితే ఇది కోర్టు ధిక్కరణ కింద పరిగణించాలని సుప్రీం కోర్టు న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఓ లేఖను అటార్నీ జనరల్ (ఏజీ) వేణుగోపాల్ కు రాశారు. అశ్విని కుమార్ లేఖను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాసిన లేఖనూ ఏజీ తిరస్కరించారు. అయితే ఈ సందర్భంగా ఏజీ కేకే వేణుగోపాల్ మరో లేఖను రాస్తూ ‘తాను ఈ విషయంపై అంగీకరించలేను. అయితే వాస్తవాలను సుప్రీంకోర్టు ఎదుట హాజరుపరుస్తూ, సుమోటో యాక్షన్ తీసుకోమని అభ్యర్థించవచ్చు’అని పేర్కొన్నారు.