అధికారంలో ఉన్నపుడు ఎక్కడా ఆగకుండా ఒంటికాలిపై లేచిన ట్రంప్ కు ప్రజలు బాగానే దెబ్బకొట్టారు. ఇప్పటివరకు ఒకసారి అధ్యక్షులైన వారు రెండోసారి ఖచ్చితంగా అయ్యారు. తమ పాలన దక్షతతో అమెరికన్ల మనసు చూరగొన్నారు. గత బరాక్ ఒబామా సైతం ఇలానే అయ్యాడు. కానీ ట్రంప్ వద్దకు వచ్చేసరికి ట్రెయిన్ రివర్స్ అయ్యింది.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు
అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే అధ్యక్షుడిగా పోటీచేయవచ్చు. ఇప్పటివరకు మొత్తం 45 మంది అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు.
Also Read: జోబైడెన్ తొలి ప్రసంగం.. ఏం వరాలిచ్చాడంటే?
1992 తర్వాత రెండోసారి గెలవని తొలి అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ నిలిచారు. అమెరికా ఎన్నికల్లో ఓడిన ట్రంప్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
Also Read: తమిళ కలువ ‘కమల’.. అమెరికా ఉపాధ్యక్షురాలు ఎలా అయ్యింది?
గత 231 ఏళ్లలో ట్రంప్ తో కలిసి 11 మంది మాత్రమే వరుసగా రెండోసారి గెలవడంలో విఫలమయ్యారని అమెరికా ఎన్నికల చరిత్ర చెబుతోంది. వీరిలో కొందరు చనిపోయిన కారణంగా రెండోసారి అధ్యక్షులు కాలేకపోయారు. మిగతా వారు తమ పాలన వైఫల్యంతో రెండోసారి గెలవకుండా ఓడిపోయారు.