
వచ్చే డిసెంబర్‌లో 6500 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం జరిగిన కార్యమ్రంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ శాఖలో 6500 పోస్టులకు డిసెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేస్తామని నాలుగుదశలో పోస్టుల భర్తీ చేస్తామని ఆయన అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా దిశా పోలీస్‌స్టేషన్లను తీసుకొచ్చామన్నారు. దిశా బిల్లును శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపామన్నారు. మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కొనియాడారు. అలాగే పోలీసు శాఖకు ఉన్న బకాయిలను వెంటనే చెల్లిస్తామన్నారు.