Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదు. దీంతో మంత్రులకు సైతం చాలా విషయాలు చెప్పకుండా గోప్యంగానే ఉంచుతారు. పరిపాలనా విధానంలో ఎవరిని కూడా విశ్వసించరు. తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుని తక్షణమే అమలు చేయడమే ఆయనకు అలవాటు. అలా జరిగిందే మూడు రాజధానుల బిల్లు రద్దు వ్యవహారం. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసే వరకు కూడా ఎవరికి కూడా దీనిపై అవగాహన లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయన నిర్ణయాలన్ని ఇలాగే ఉంటాయని సరిపెట్టుకోవడమే.
తాజాగా శాసనమండలి రద్దును కూడా వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ విస్తరణపై భారీగా ఆశావహులు బయలుదేరారు. తమకు మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని కలలు కంటున్న వారి సంఖ్య కూడా రెట్టింపు అవుతోంది. ఈ నేపథ్యంలో అందరిని ఊరిస్తున్న అంశం మంత్రివర్గ విస్తరణ. కొద్ది కాలంగా దానిపై ఆశలు పెట్టుకున్న వారు ఆనంద డోలికల్లో ఉయ్యాలలూగుతున్నారు. కానీ జగన్ మనసులో ఎవరున్నారో ఎవరికి అర్థం కాదు.
వచ్చే ఏడాదిలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి నుంచే జగన్ చుట్టు ప్రదక్షిణలు చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే సూచనలు కనిపిస్తుండటంతో జగన్ మెప్పు కోసం తిప్పలు పడుతున్నారు. మంత్రి పదవి కోసం అహర్నిషలు తిరుగుతున్నారు.
Also Read: Janasena Pawankalyan:అమరావతి రైతుల పాదయాత్రకు పవన్ వెళ్లడట..!
శాసనమండలి రద్దును వెనక్కి తీసుకున్న తరుణంలో మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీలను సైతం తీసుకునే వీలున్నందున వారు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జగన్ వెంట పడుతూ తమకు అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణ జగన్ కు పెద్ద తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. విడువు మంటే పాముకు కోపం మింగుమంటే కప్పకు కోపం అన్న చందంగా వైసీపీ పరిస్థితి తయారయింది. ఈ క్రమంలో జగన్ ఏ మేరకు నిర్ణయం ఎవరిని ప్రసన్నం చేస్తారో వేచి చూడాల్సిందే.
Also Read: Kapu leaders: హాట్ టాపిక్: టీడీపీలో కాపు నేతలు మౌనం ఎందుకు?
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Ap legislative assembly passes resolution seeking to continue legislative council
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com