YS Jagan Mohan Reddy : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) దూకుడు పెంచారు. కూటమి పాలన ఎనిమిది నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. పార్టీ నేతలతో వరుస భేటీలు కొనసాగిస్తున్నారు. జగన్ 2.0 అంటూ సంచలన ప్రకటన చేశారు. 1.0 అనేది ప్రజల కోసమని.. 2.0 కార్యకర్తల కోసమని వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. క్లిష్ట సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. వైసిపి నుంచి వెళ్లిన నేతల స్థానంలో కొత్తవారిని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పిసిసి మాజీ చీఫ్ సాకే శైలజానాధ్ ను వైసీపీలో చేర్చుకున్నారు. ఇంకా మరికొందరు నేతలు వైసీపీలోకి వస్తారని ప్రచారం నడుస్తోంది.
* కార్యాలయంలో బిజీ బిజీ
తాడేపల్లి( Tadepalli) కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. తాజాగా పార్టీ సీనియర్లతో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి వారికి దిశ నిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం పై వ్యతిరేకత పెరుగుతోందని.. దానిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నేతల దేనిని తేల్చి చెప్పారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని కూడా పేర్కొన్నారు. అందుకే అందరూ సమిష్టిగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. తన జిల్లాల పర్యటన పై సైతం ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచడంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం కనిపిస్తోంది.
* ఇకనుంచి మరింత దూకుడు
విదేశీ పర్యటన నుంచి వచ్చిన జగన్( Jagan Mohan Reddy) మరింత దూకుడుగా ముందడుగు వేయాలని భావిస్తున్నారు. ఉగాది తర్వాత జిల్లాల పర్యటన మొదలుపెట్టాలని చూస్తున్నారు. ప్రస్తుతం 13 జిల్లాల స్థానిక ప్రజాప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. వారి సేవలను వినియోగించుకోవడం ద్వారా పార్టీని మరింత అభివృద్ధి చేయాలని.. బలోపేతం చేయాలని చూస్తున్నారు. జిల్లాల వారీగా వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం కానున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పిటిసి లతో సమావేశం అయి వారికి కీలక బాధ్యతలు అప్పగించనున్నారు.
* వారంతా పార్టీలోనే
మరోవైపు జగన్ దూకుడు చూస్తున్న చాలామంది నేతలు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు. వాస్తవానికి చాలామంది నేతలు వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడిచింది. పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి బయటకు వెళ్లడంతో.. చాలామంది ఆయనను అనుసరిస్తారని అంచనా వేశారు. అయితే జగన్ పొలిటికల్ రివర్స్ గేమ్ స్టార్ట్ చేయడంతో వైసిపి నేతలంతా పార్టీలోనే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కీ లక నియోజకవర్గాల ఇన్చార్జిలు యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి దూకుడు వైసీపీకి ఉపశమనం కలిగించే విషయం.