Anchor Syamala : ఏపీలో శాంతిభద్రతల విఘాతంపై అధికార, విపక్షం మధ్య మాటల యుద్ధం ప్రారంభం అయింది. టిడిపి కూటమి పాలనలో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని..చిన్నారులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పుంగనూరులో ఆరేళ్ల బాలిక హత్య ఘటనపై మాజీ సీఎం జగన్ రియాక్ట్ అయ్యారు. పుంగనూరులో బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళనున్నారు. ఇందుకు సంబంధించి అక్టోబర్ 9న షెడ్యూల్ ఖరారు అయ్యింది. అటు వైసీపీ నేతలు సైతం వాయిస్ పెంచారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినంత పని చేస్తున్నారు. ఈ క్రమంలో వైసిపి అధికార ప్రతినిధి,యాంకర్ శ్యామల స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు,ఏపీ ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల్లో వైసీపీ తరఫున యాంకర్ శ్యామల ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై ఆమె చేసిన విమర్శలు వైరల్ అయ్యాయి.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె టిడిపి తో పాటు జన సైనికులకు టార్గెట్ అయ్యారు. అయితే తాను ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని.. విమర్శలు కూడా చేయలేదని చెప్పుకొచ్చారు శ్యామల.అందరూ సహృదయంతో ఆలోచించాలని కోరారు.తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆమె వెనక్కి తగ్గిందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా వైసీపీ హై కమాండ్ ఆమెకు అధికార ప్రతినిధి హోదా కట్టబెట్టింది. అప్పటినుంచి రాజకీయ విమర్శలు చేయడం ప్రారంభించారు శ్యామల.
* ఘాటైన పదజాలాలతో
తాజాగా పుంగునూరు ఘటనపై స్పందించారు. చంద్రబాబు సర్కార్ పై తీవ్ర స్థాయిలో విడుచుకుపడ్డారు.’ నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కొమ్ముకున్నాయి. ఆడపిల్లలు అర్థరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో.. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ మాత్రం ఎటు పోతోంది. ఓట్ల కోసం గ్యారెంటీ లతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసిబిడ్డలు సైతం జంకుతున్నారు. పుంగనూరు ఘటనపై ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచార సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు.. జరుగుతున్న అఘాయిత్యాలపై నోరు మెదప్రియ స్వామి.. అంటూ పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా మాట్లాడారు శ్యామల.
* ప్రత్యేకంగా వీడియో విడుదల
అంతటితో ఆగని ఆమె రామ రాజ్యాన్ని రావణకాష్టంగా మార్చిన ఈ కూటమి పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకపోవడం సిగ్గుచేటు. మాకు మా ఆడపిల్లల మానప్రాణాలే ముఖ్యం. చంద్రబాబు సొంత జిల్లాలో ఇంత ఘోరం జరిగితే మీకేం అనిపించలేదా? బాబు వస్తే అదొస్తుంది.. ఇదోస్తోంది అన్నది దేవుడేరుగు. ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక అంటూ యాంకర్ శ్యామల సోషల్ మీడియా వేదికగా వీడియో రిలీజ్ చేశారు. అయితే పుంగనూరు ఘటనకు సంబంధించి ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్య జరిగింది అన్నది పోలీసుల నుంచి వినిపిస్తున్న మాట. బాలిక తండ్రి వద్ద ఓ మహిళ మూడున్నర లక్షల రూపాయలు తీసుకుందని.. ఆ సొమ్ము వెనక్కి ఇవ్వాలంటూ బెదిరిస్తుండడంతోనే బాలిక తండ్రి పై కోపంతో చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఓట్ల కోసం గ్యారంటీలతో జనాన్ని బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ @JaiTDP కూటమి పాలనలో.. పసిబిడ్డలకి కూడా రక్షణ కరువైంది
రామ రాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చేశారు.. ఆడబిడ్డలపై ఇంతలా అత్యాచారాలు జరుగుతున్నా నోరుమెదపరేంటి?
-శ్యామల గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి… pic.twitter.com/GrHuvJf5E7
— YSR Congress Party (@YSRCParty) October 6, 2024