Harsha Sai: హర్ష సాయి పాప్యులర్ యూట్యూబర్. అతడు పేదవారికి సహాయం చేస్తూ ఫేమస్ అయ్యాడు. కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేస్తాడు. ఇళ్ళు, షాప్స్ కూడా సమకూర్చిన సందర్భాలు ఉన్నాయి. హర్ష సాయి ఇంత మందికి సహాయం చేయడానికి డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయనే సందేహాలు ఉండేవి. హర్ష సాయి హెల్పింగ్ వీడియోలకు విశేష స్పందన వస్తుంది. హర్ష సాయి యూట్యూబ్ ఛానల్ కి ఏకంగా కోటి మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు.
ఒక్కో వీడియోకి మిలియన్స్ లో వ్యూస్ దక్కుతాయి. ఏడాది క్రితం హర్ష సాయి మెగా టైటిల్ తో ఓ భారీ ప్రాజెక్ట్ ప్రకటించాడు. టీజర్ కూడా విడుదల చేశాడు. ఆ చిత్రానికి అతడే దర్శకుడు, హీరో. ఈ ప్రాజెక్ట్ విషయంలోనే హర్ష సాయి చిక్కుల్లో పడ్డాడు. మెగా మూవీ నిర్మాతను అతడు బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు, లైంగిక దాడికి పాల్పడ్డాడనేది ప్రధాన ఆరోపణ.
మెగా మూవీ నిర్మాత ఓ అమ్మాయి. ఆ చిత్రంలో ఆమె హీరోయిన్ కూడా అట. బాధితురాలితో హర్ష సాయికి ఉన్న పరిచయం రీత్యా… తన వద్ద మంచి కథ ఉంది. సినిమా తీద్దామని ఒప్పించాడు. ఒకరోజు కథా చర్చలకు ఆహ్వానించి, ఆమెకు మత్తు పదార్థాలు తెలియకుండా ఇచ్చాడు. సబ్ కాన్షియస్ లో ఉన్న ఆమె నగ్న చిత్రాలు తీశాడు. అలాగే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి నగ్న ఫోటోలు చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేశాడు.
మెగా మూవీ ద్వారా వచ్చే డబ్బులు కూడా కాజేయాలని చూశాడు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే… చట్టపరమైన చిక్కుల్లో పడతామని తెలిసి పెళ్లి నాటకం ఆడాడు. వివాహం చేసుకుందామని నమ్మించాడు. ఈ ప్లాన్ లో హర్ష సాయి తండ్రి పాత్ర కూడా ఉందని బాధితురాలి లాయర్ ఆరోపిస్తున్నారు. రూ. 2 కోట్ల కోసం బాధితురాలు హర్ష సాయి మీద తప్పుడు కేసు పెట్టిందని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆమె లాయర్ అన్నారు.
ఫేక్ ఆడియో కాల్స్ సృష్టించి… బాధితురాలిని మరింత వేధింపులకు గురి చేస్తున్నారు. ఆధారాలు లేకుండా బాధితురాలి మీద తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద చర్యలు తీసుకుంటామని లాయర్ అన్నారు. శేఖర్ బాషాతో పాటు పలువురు హర్ష సాయికి మద్దతుగా మాట్లాడిన సంగతి తెలిసిందే.
హర్ష సాయి విదేశాలకు పారిపోయాడని మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు హర్ష సాయిని పోలీసులు అరెస్ట్ చేశారని అంటున్నారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో వివరాలు వెల్లడిస్తారు. కాబట్టి హర్ష సాయి ఎక్కడ ఉన్నాడు? ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? అనేది సస్పెన్సు గా మారింది.