https://oktelugu.com/

Neymar Jr: ఫుట్ బాలర్ ఇంట్లో చెట్టుకి డబ్బులు కాస్తున్నాయి కావచ్చు.. లేకుంటే అంత ఖర్చు పెట్టి ద్వీపం కొంటున్నాడంటే మాటలా?

క్లబ్ లు భారీగా డబ్బులు ఇస్తుండడం.. ప్రకటనలు, ఇతర మార్గాల ద్వారా భారీగా ఆదాయం వస్తుండడంతో ఆటగాళ్లకు ఏం చేయాలో తెలియడం లేదు. అందువల్లేవారు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ద్వీపాలను కొనేస్తున్నారు. బంగ్లాలను నిర్మించుకుంటున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 7, 2024 11:43 am
neymar jr eying to buy private island

neymar jr eying to buy private island

Follow us on

Neymar Jr: ప్రపంచంలో కొంతమంది ఆటగాళ్ల, సినిమా తారల వద్ద అపరిమితంగా డబ్బు ఉంటుంది. ఎందుకంటే వారికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో డబ్బు ఆ స్థాయిలో వచ్చి పడుతుంది. ఆ డబ్బుతో వారు విలాసాలలో మునిగి తేలుతారు. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే పనులు చేస్తారు. ఇప్పుడు అలాంటి పనే ఓ ఫుట్ బాలర్ చేశాడు.

క్లబ్ లు భారీగా డబ్బులు ఇస్తుండడం.. ప్రకటనలు, ఇతర మార్గాల ద్వారా భారీగా ఆదాయం వస్తుండడంతో ఆటగాళ్లకు ఏం చేయాలో తెలియడం లేదు. అందువల్లేవారు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ద్వీపాలను కొనేస్తున్నారు. బంగ్లాలను నిర్మించుకుంటున్నారు. విదేశాలలో ఆస్తులను పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాడు నెయ్ మార్ జూనియర్ చేరాడు. భారీగా వస్తున్న డబ్బుతో ఏం చేయాలో తెలియక అతడు జపాన్ దేశంలోని ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. అమ్మకం దారుడితో బేరం కుదుర్చుకున్నాడు. త్వరలోనే అతడు ఆ ద్వీపంలో అడుగు పెట్టనన్నాడు..

ఇంతకీ ధర ఎంత అంటే..

జూనియర్ నెయ్ మార్ అనే ఫుట్ బాల్ ఆటగాడు జపాన్ దేశంలో కొనుగోలు చేస్తున్న ద్వీపం విలువ అక్షరాల 64 కోట్లు. ఇప్పటికే అమ్మకం దారుడితో జూనియర్ నెయ్ మార్ చర్చలు పూర్తి చేశాడు. ఇప్పటికే ముందస్తుగా కొంత నగదు చెల్లించడాని తెలుస్తోంది. ఆ ద్వీపం మొత్తం ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో ఒక ప్రధాన విల్లా ఉంది. రెండు మాస్టర్ సీట్లు అధునాతన సౌకర్యాలతో కూడి ఉన్నాయి. సముద్రపు అందాలను చూసేందుకు వీలుగా రెండు పెద్ద భవనాలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఒక చిన్న నీటి కొలను.. భారీ హెలికాప్టర్ కూడా దిగడానికి హెలిపాడ్.. ఖాళీ స్థలం ఉన్నాయి. జూనియర్ నెయ్ మార్ పలు క్లబ్బులకు ఫుట్ బాల్ ఆడాడు. గతంలో అతడు పారిస్ సెయింట్ జర్మని కి ప్రాతినిధ్యం వహించాడు. ఫార్వర్డ్ ఆటగాడిగా సత్తా చూపించాడు. ఇప్పుడు ప్రస్తుతం సౌదీ అరేబియాలోని ఆల్ హీలాల్ అనే క్లబ్ కు ఆడుతున్నాడు. దీనికిగాను అతడు కళ్ళు చెదిరే పారితోషికం అందుకుంటున్నాడు. గాయం వల్ల గత ఏడాది అతడు జాతీయ జట్టుకు దూరమయ్యాడు. అయినప్పటికీ సంపాదనలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. పైగా అంతకుమించి అనేలాగా ఆర్జిస్తూ.. ఫోర్బ్స్ జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు.. అత్యంత విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తూ తరచూ మీడియాలో నానుతున్నాడు. ” ఫుట్ బాలర్ ఇంట్లో చెట్టుకు డబ్బులు కాస్తున్నాయి. అందువల్లే అతడు ఈ స్థాయిలో ఆస్తులు కొనుగోలు చేస్తున్నాడు. చాలామంది ఆడుతుంటారు.. కానీ ఇతడు ఫుట్ బాల్ ఆటకే అందం తీసుకొచ్చాడు. అనితర సాధ్యమైన వేగాన్ని పరిచయం చేశాడు. అందువల్లే సమకాలీన ఫుట్ బాల్ క్రీడలో సరికొత్త ఆటగాడిగా నిలిచాడు. అందువల్లే ఇతనికి డబ్బులు ఇవ్వడానికి పెద్ద పెద్ద క్లబ్బులు ముందుకు వస్తున్నాయి. అతడికి డిమాండ్ ఉంది కాబట్టే ఆ స్థాయిలో సంపాదిస్తున్నాడని” సోషల్ మీడియా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.