Homeఆంధ్రప్రదేశ్‌YSRCP faces two major crises: వైసీపీకి రెండు సంక్షోభాలు

YSRCP faces two major crises: వైసీపీకి రెండు సంక్షోభాలు

YSRCP faces two major crises: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి ఏపీలో రెండు సంక్షోభాలు తప్పేలా లేవు. ఒకటి అమరావతి. రెండోది అన్యమత అపవాదు. ఇటీవల అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరి చెప్పలేదు. మరోవైపు ఆకివీడులో రఘురామకృష్ణం రాజు పై అన్యమతస్తుల పేరుతో దాడి ప్రయత్నం జరిగింది. శ్రీరామనవమి నాడు శ్రీరాముడి విగ్రహానికి పూలమాలలు వేస్తుండగా కొందరు అడ్డుకున్నారు. ఆ విషయంలో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరి చెప్పలేదు. ఈ రెండు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంక్షోభాలుగా ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమరావతి విషయంలో..
అమరావతి రాజధాని విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలే కాదు అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అమరావతి విషయంలో ఎటువంటి వ్యతిరేక ప్రచారం జరిగినా దాని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నది బహిరంగ రహస్యం.. ఆది నుంచి అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి అలానే ఉంది. అమరావతి రాజధానికి ఏకాభిప్రాయం పేరుతో సమర్ధించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేసింది. అలాగని మూడు రాజధానుల ను నిర్మించలేకపోయింది. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా అమరావతికి తాము వ్యతిరేకం కాదన్న మాట పరోక్షంగా చెప్పుకొచ్చింది. కానీ అదే విషయాన్ని సభకు వచ్చి చెప్పే అవకాశాన్ని కూడా చేజేతులా కోల్పోయింది.

Also Read: పవన్ కళ్యాణ్ సార్.. మా బిడ్డ ఆత్మకు శాంతి చేకూర్చండి.. వీడియో వైరల్

ఆ ఘటనపై స్పందించకుండా..
తాజాగా ఆకివీడు వ్యవహారం పొలిటికల్ సర్కిల్లో హాట్ రేపుతోంది. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రఘురామకృష్ణం రాజు శ్రీరామనవమి నాడు శ్రీరాముడి విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ప్రయత్నించగా కొంతమంది అడ్డుకున్నారు. దీనిపై ఇంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. అదే ముస్లిం, క్రిస్టియన్ విషయంలో వేగంగా స్పందించే ఆ పార్టీ… హిందూ మతానికి సంబంధించిన విషయాలపై పెద్దగా స్పందించడం లేదనే విమర్శ మూటగట్టుకుంది. ఇంతవరకు ఈ ఘటనపై స్పందించకపోవడం రాజకీయంగా విమర్శలకు దారితీస్తోంది. మున్ముందు ఈ పరిణామం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంక్షోభంగా మిగలనుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version