https://oktelugu.com/

YSR District : వైఎస్సార్ పేరు తొలగింపు..కూటమి ప్రభుత్వం సంచలనం

YSR District : వైయస్సార్ పేరిట ఏర్పాటు చేసిన అన్ని నిర్మాణాలను తొలగించే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా కడప జిల్లాకు వైయస్సార్ జిల్లాగా పేరు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై సైతం ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

Written By: , Updated On : March 18, 2025 / 12:06 PM IST
YSR District

YSR District

Follow us on

YSR District : కూటమి ప్రభుత్వం( Alliance government) దూకుడు మీద ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను పునసమీక్షిస్తోంది. అందులో భాగంగా వైయస్సార్ పేర్లను మార్పు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తాడిగడప మునిసిపాలిటీ పేరును మార్చింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో వైయస్సార్ తాడిగడప అని పేరు పెట్టారు. తాడిగడప ముందు వైయస్సార్ పేరును తొలగిస్తూ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ పేరిట ఏర్పాటు చేసిన అన్ని నిర్మాణాలను తొలగించే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా కడప జిల్లాకు వైయస్సార్ జిల్లాగా పేరు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై సైతం ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read : పెద్దిరెడ్డి ముందస్తు బెయిల్!

* సాహసించిన జగన్
ఉమ్మడి ఏపీలో( combined Andhra Pradesh ) కడప జిల్లాది( Kadapa district ) ప్రత్యేక స్థానం. ఆ జిల్లా పేరు మార్చేందుకు ఎవరు సాహసించలేదు. కడప అంటేనే ఒక చరిత్ర ఉంది. కానీ దానిని కనీస స్థాయిలో కూడా పరిగణలోకి తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాను వైయస్సార్ జిల్లా గా మార్చేశారు. అడ్డగోలుగా ఉత్తర్వులు జారీ చేశారు. అలా మార్చవద్దని కడప జిల్లా ప్రజలు కోరినా ఫలితం లేకపోయింది. అడ్డగోలుగా మార్చేశారు. కడప జిల్లా అనేది ఒకటి ఉండేదని మాత్రమే అందరికీ తెలిసేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దానిని తిరిగి కడప జిల్లాగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. అందుకు సంబంధించి సన్నాహాలు కూడా చేస్తోంది.

* అమరజీవి పేరు కొనసాగింపు..
జిల్లాల పునర్విభజన( district devidation ) సమయంలో చాలా జిల్లాలకు సంబంధించి కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. అలా వచ్చిందే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకోవాలని భావించారు. అది సముచితం కూడా. కానీ నెల్లూరు సైతం కొనసాగేలా.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని నామకరణం చేశారు. కడప విషయంలో సైతం ఇదే మాదిరిగా చేయాలన్న విన్నపాలు వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. కడపోళ్లం అని గర్వపడేలా చెప్పుకునే వారు అక్కడ ప్రజలు. కానీ తాము వైయస్సార్ జిల్లా వాళ్ళ అని చెప్పుకునేందుకు కాస్త ఇబ్బంది పడుతూ వచ్చారు. ఓటమి ప్రభుత్వం రాగానే వైయస్సార్ జిల్లాను కడప జిల్లాగా అధికారికంగా మార్చాలన్న వినతులు వచ్చాయి.

* కడప జిల్లా పేరు మార్పు
అయితే కూటమి ప్రభుత్వం ఇక్కడే కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం వైయస్సార్ జిల్లాగా కాకుండా.. వైయస్సార్ కడప జిల్లాగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. వైయస్సార్ పేరు తొలగిస్తే అనవసర రాజకీయాలకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అయితే కూ టమి ప్రభుత్వం వినూత్న ఆలోచనలతో ముందుకెళుతుండడం విశేషం. అయితే గతంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా పేర్లను తొలగించేది.

Also Read : ఏపీలో ఉచిత విద్యుత్.. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్!