Free Electricity Scheme : ఏపీ ప్రభుత్వం ( AP government )మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వినియోగానికి సంబంధించి ఆ వర్గానికి ప్రయోజనం చేకూరుస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే ప్రతిపాదనలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పవర్ లూమ్స్ కు కూడా 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ప్రతిపాదనలకు పచ్చ జెండా ఊపింది ఏపీ క్యాబినెట్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Also Read : పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్షన్ వైరల్!
* చంద్రబాబు హామీ
చేనేత కార్మికులకు ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు( CM Chandrababu) పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. చేనేత రంగం మరింత అభివృద్ధికి గాను కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు కూడా తెలిపారు. అందులో భాగంగానే చేనేత కార్మికుల ఇళ్లకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని ప్రతిపాదన చాలా రోజులుగా ఉంది. ఎట్టకేలకు క్యాబినెట్ సమావేశంలో ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రతిపాదనను ఆమోదించారు. ఇకనుంచి చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించనున్నారు. పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే అవకాశం ఉంది.
* పలు ప్రతిపాదనలకు ఆమోదం
మరోవైపు క్యాబినెట్ సమావేశంలో( Cabinet meeting ) కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో భూ కేటాయింపులపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు సైతం ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ పై రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ సమర్పించిన నివేదికకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యువల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు సైతం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. నాయి బ్రాహ్మణులకు సంబంధించి సైతం ఉచిత విద్యుత్ అందుతోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి చేనేత కార్మికులు వెళ్ళనున్నారు.
Also Read : ‘అమరావతి’ని ఫిక్స్ చేయనున్న మంత్రివర్గం