Viral Photo : ఏపీ ( Andhra Pradesh)అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. నిబంధనల మేరకు ప్రతిపక్ష హోదా దక్కలేదు. దీంతో అప్పటినుంచి అసెంబ్లీకి హాజరు కావడం మానేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ రోజు అనూహ్యంగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 11 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు సైతం హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇకనుంచి అసెంబ్లీ సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరు కారని తేల్చేశారు.
* వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ
జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) అసెంబ్లీ సమావేశాలకు హాజరు పై ఎంతో ఉత్కంఠ నడిచింది. కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకే ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి బయటకు వెళ్ళిపోయారు. కేవలం 10 నిమిషాలలోనే అంతా ముగించారు.
* అంతటా ఒకటే ఆసక్తి
అయితే జగన్మోహన్ రెడ్డి సభలోకి రావడంతో అటు కూటమి ఎమ్మెల్యేలు( Alliance MLAs ) సైతం ఓ రకమైన ఆసక్తి కనిపించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రజలు కూడా శాసనసభలో ఏం జరుగుతుంది అని శ్రద్ధగా గమనించారు. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అయింది. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక బ్లాక్ ఇచ్చారు. ఆ బ్లాక్ నెంబర్ కూడా 11. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బలం 11. ఇప్పటికే ఈ 11 సంఖ్య పై పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు 11 బ్లాక్ కేటాయించారంటూ సెటైర్లు పడుతున్నాయి.