TDP Alliance
TDP Alliance: ఏపీలో( Andhra Pradesh) మరో ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న ఐదుగురు సభ్యుల పదవీకాలం మార్చి 29 లోగా ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి మూడున ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 20న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరగనుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు, తిరుమల నాయుడు పదవీకాలం మార్చి 29 తో ముగియనుంది. దీంతో వీరి స్థానంలో ఎమ్మెల్సీల ఎన్నిక అనివార్యంగా మారింది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 27న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.
164 సీట్లతో టిడిపి కూటమి( TDP Alliance ) బలమైన శక్తిగా ఉంది. ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఎన్డీఏ కూటమి ఖాతాలో చేరే అవకాశం ఉంది. అయితే ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీలు ఈ ఐదు సీట్లను ఎలా పంచుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇంకో విషయం ఏమిటంటే ఈ ఐదు ఎమ్మెల్సీ సీట్లు తెలుగుదేశం పార్టీకి చెందినవే. ఇందులో కొందరు రెన్యువల్ కూడా కోరుతున్నారు. మరోసారి ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో టిక్కెట్లు త్యాగం చేసిన నేతలు సైతం ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. దీంతో నేతలకు సర్దుబాటు చేయడం సీఎం చంద్రబాబుకు ఒకంత కష్టమే.
* యనమల రామకృష్ణుడు
యనమల రామకృష్ణుడు( yanamalai Ramakrishnudu)పార్టీలో సీనియర్ నేత. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న నాయకుడు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కూడా. ఇంతవరకు టిడిపి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు ఆయన కీలక పదవుల్లో కొనసాగుతూ వచ్చారు. ఒకసారి మాత్రమే శాసనసభ స్పీకర్ అయ్యారు. మిగతా సమయాల్లో మాత్రం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగే వారు. ఎన్నికల్లో ఆయన తప్పుకున్నారు. తన బదులు కుమార్తెకు అవకాశం ఇచ్చారు. అయితే యనమల రామకృష్ణుడు మంత్రి పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు ఆయన పేరును గవర్నర్ పోస్ట్ కు చంద్రబాబు సిఫార్సు చేస్తున్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. మరోవైపు రాజ్యసభ పదవి సైతం ఆశిస్తున్నట్లు టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ తిరిగి యనమలకు ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.
* జంగా కృష్ణమూర్తి
జంగా కృష్ణమూర్తి( janga Krishnamurthy) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గురజాల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2024 ఎన్నికల్లో గురజాల నియోజకవర్గ వైయస్సార్సీపి టికెట్ ఆశించారు. కానీ ఆయనకు దక్కలేదు. 2024 ఏప్రిల్ 1 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2019లో ఎమ్మెల్యేల కోట కింద ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్నారు. టిడిపి నుంచి ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం.
* దువ్వారపు రామారావు
దువ్వారపు రామారావు ( duvvarapu Rama Rao) సైతం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. విశాఖ జిల్లాకు చెందిన సుదీర్ఘకాలం పార్టీలో పని చేశారు. 2019లో ఎమ్మెల్యేల కోట కింద జరిగిన ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్సీగా విజయం సాధించారు. గోదావరి జిల్లాలకు చెందిన ఈయన విశాఖలో స్థిరపడ్డారు. తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాలో పని చేశారు. ఆయన సేవలను గుర్తించిన చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మరోసారి ఎమ్మెల్సీ పదవిని కోరుకుంటున్నారు.
* పరుచూరి అశోక్ బాబు
పరుచూరి అశోక్ బాబు( Paru Churi Ashok Babu) ఉద్యోగ సంఘాల నేత. ఏపీ ఎన్జీవో సంఘాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 2014లో టిడిపి అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు. అంతకు ముందు నుంచే టిడిపికి గట్టి మద్దతు దారుడుగా ఉండేవారు. దీంతో చంద్రబాబు అశోక్ బాబును పిలిచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2019 ఎమ్మెల్యే కోటాలో రెండోసారి ఛాన్స్ కల్పించారు. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపించారు. చంద్రబాబుకు అత్యంత విధేయత కలిగిన నేత. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. మరోసారి ఆయన ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు.
* తిరుమల నాయుడు
బెందుల తిరుమల నాయుడు( bindula Tirumala Naidu ). ఈయన సైతం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతూ వచ్చారు. 1994లో టిడిపిలో క్రియాశీలక సభ్యుడిగా చేరారు. 2009లో కర్నూలు లోక్సభ స్థానానికి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. 2014లో రెండోసారి బరిలో దిగారు. అయితే రెండుసార్లు ఆయన ఓటమి చవిచూశారు. అయితే పార్టీ కోసం కృషి చేసిన నేతగా గుర్తింపు పొందారు. అందుకే 2019లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మరోసారి ఎమ్మెల్సీ పదవిని కోరుకుంటున్నారు. అయితే ఈ ఐదుగురు ఎమ్మెల్సీల్లో.. జంగా కృష్ణమూర్తిని తప్పించి నలుగురు టిడిపి సిట్టింగులు. నలుగురు పదవులు కోరుకుంటున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Election commission releases schedule for mla quota mlc elections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com