YSR Congress (1)
YSR Congress: రాయలసీమలో( Rayala Seema ) అత్యంత ఆప్ నియోజకవర్గం రాప్తాడు. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. ఇక్కడ పరిటాల ఫ్యామిలీ వెర్సెస్ తోపుదుర్తి కుటుంబం అన్నట్టు పరిస్థితి ఉంటుంది. ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. తాజాగా రాప్తాడులో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సకాలంలో పోలీసులు స్పందించడంతో వివాదాలు సద్దుమణిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్తు అధ్యక్ష ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి ఎంపీపీ ఎన్నికకు సిద్ధపడింది. కానీ ఇక్కడ టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ వాతావరణం దారితీసింది.
Also Read: కడపలో సరే.. మరి విశాఖలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహం అదే!
* నిలిచిన ఎంపీపీ ఎన్నిక
ఉమ్మడి అనంతపురం( anantpuram ) జిల్లాలో వివిధ మండలాల్లో మండల పరిషత్తులకు సంబంధించి ఉప ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగా రామగిరి మండల ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు సిద్ధపడ్డారు. కానీ సాంకేతిక కారణాలు చూపుతూ అక్కడ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. కొంతమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులను బైండోవర్ చేసేందుకు పోలీసులు పెనుగొండ తహసిల్దార్ వద్దకు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తమ అనుచరులతో అక్కడకు వచ్చారు. తమ పార్టీ ఎంపీటీసీ సభ్యులను బయటకు పంపాలని డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తహసిల్దార్ కార్యాలయంలో లోపలికి వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. అయితే కొంత సేపటికి టిడిపి నాయకులు అక్కడకు చేరుకున్నారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య నినాదాలు పర్వం నడిచింది. పోలీసుల సముదాయించడంతో సద్దుమణిగింది ఆ వివాదం.
* ఒకరు అదృశ్యం
అయితే ఐదుగురు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఎంపీటీసీలను తీసుకెళ్లారు పోలీసులు. కానీ అందులో ఒకరు అదృశ్యమయ్యారు. దీనిపై ప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడులో పరిటాల కుటుంబం రౌడీయిజానికి పాల్పడుతోందని.. తాము అధికారంలోకి వస్తే మూల్యం చెల్లించుకుంటారని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తక్షణం మహిళా ఎంపీటీసీ సభ్యురాలను పంపించాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన కూడా చేశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
* మీడియా ముందుకు బాధిత ఎంపీటీసీ సభ్యురాలు
మరోవైపు కిడ్నాప్నకు గురైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు( mptc member ) మీడియా ముందుకు వచ్చారు. తనను హైదరాబాద్కు తీసుకెళ్లి ఓ ఇంట్లో దాచేసారని సంచలన ఆరోపణలు చేశారు. అయినా సరే తాను బయటపడి వచ్చానని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. దీంతో ఆమె వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ధైర్యశాలివి అమ్మ అంటూ పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.
ప్రత్యర్ధుల ప్రలోభాలకు లొంగకుండా నమ్మిన పార్టీకి అండగా నిలిచిన వీరవనిత https://t.co/k6cwSt2aOJ pic.twitter.com/ZJm1dk0efY
— Jaganism (@JaganismPOY) March 27, 2025