https://oktelugu.com/

CPS Employees: సిపిఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో రూ.2300 కోట్లు

CPS Employees సంక్రాంతి తర్వాత సుమారు 1000 కోట్ల రూపాయల పాటు బకాయిలు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. ఇటీవల మరో 6,200 కోట్ల రూపాయలు ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యాయి.

Written By: , Updated On : March 28, 2025 / 01:41 PM IST
CPS Employees

CPS Employees

Follow us on

CPS Employees: ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం( Alliance government) సానుకూల నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి వివిధ బకాయిలను చెల్లించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇటువంటి తరుణంలో సిపిఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఒకేసారి సిపిఎస్ ఉద్యోగుల ఫ్రాన్ ఖాతాల్లో ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ బకాయిల కింద 2300 కోట్ల రూపాయల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఒక్కో సానుకూల నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగ వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. మొన్నటికి మొన్న నిధుల విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా ఆమోదం తెలపడంతో ఉద్యోగులు ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.

Also Read: కడపలో సరే.. మరి విశాఖలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహం అదే!

* వరుసగా బకాయిల చెల్లింపు
సంక్రాంతి తర్వాత సుమారు 1000 కోట్ల రూపాయల పాటు బకాయిలు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. ఇటీవల మరో 6,200 కోట్ల రూపాయలు ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యాయి. సిపిఎస్( CPS employees),జిపిఎఫ్, ఏపీ జిఏఐ కింద ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ ఈ మొత్తాన్ని విడుదల చేసింది. దీనిపై ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగుల ప్రాంతాల్లోకి ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ బకాయిలు 2300 కోట్ల రూపాయలు చెల్లించడానికి ముందుకు రావడం శుభ పరిణామం. వైయస్సార్ కాంగ్రెస్ పెట్టిన బకాయిలను సైతం తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు రావడం విశేషం. మొత్తం తొమ్మిది నెలల మ్యాచింగ్ గ్రాంటును ఒకేసారి ప్రభుత్వం చెల్లించడం విశేషం. సిపిఎస్ ఉద్యోగులకు ఫిబ్రవరి వరకు మ్యాచింగ్ గ్రాంట్ ఫ్రొం ఖాతాల్లో జమ అయినట్లు సెల్ఫోన్లకు మెసేజ్ రావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

* గత ప్రభుత్వానికి భిన్నంగా
గత ప్రభుత్వానికి భిన్నంగా ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు 12 నెలలపాటు మ్యాచింగ్ గ్రాంట్ బకాయిలు కొనసాగేవి. అయితే ఇప్పుడు నాలుగు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు ఒకేసారి మ్యాచ్ గ్రాంట్ విడుదల చేయడం చిన్న విషయం కాదు. కూటమి ప్రభుత్వం ఇదే దూకుడుతో డిఏ బకాయిలను సైతం చెల్లిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.

* ఉద్యోగ సంఘాల నేతల్లో హర్షం
ప్రభుత్వం వరుసగా తమ విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆహ్వానిస్తున్నారు ఉద్యోగ సంఘాల( employees associations ) నేతలు. గత ప్రభుత్వ హయాంలో ఎదురైన ఇబ్బందులను గుర్తుచేసుకొని.. కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకోవడానికి గత పరిణామాలే కారణం. ఉద్యోగులను ప్రత్యర్థులుగా పరిగణించి జగన్మోహన్ రెడ్డి ఎంత మూల్యం చెల్లించుకున్నారో తెలియంది కాదు. అంతకుముందు చంద్రబాబు సర్కార్ సైతం ఉద్యోగుల ఆగ్రహానికి బాధితురాలిగా మిగిలింది. ప్రభుత్వంపై చెడ్డపేరు రాకుండా ఉండాలంటే ఉద్యోగుల అభిమానాన్ని చూరగొనాలి. ఇప్పుడు చంద్రబాబు చేస్తోంది అదే.