https://oktelugu.com/

Pithapuram Varma: వర్మను కోరుకుంటున్న పిఠాపురం ఓటర్లు.. వీడియో వైరల్!

Pithapuram Varma పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కోసం సీటు త్యాగం చేశారు వర్మ( pittapuram Varma ). 2014లో అయితే అక్కడ ఇండిపెండెంట్గా గెలిచారు వర్మ. టిడిపి టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి సత్తా చాటారు.

Written By: , Updated On : March 28, 2025 / 02:05 PM IST
Pithapuram Varma (1)

Pithapuram Varma (1)

Follow us on

Pithapuram Varma: కొందరు నేతలకు కొన్ని నియోజకవర్గాలు పదిలంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి పులివెందుల( pulivendula), చంద్రబాబుకు కుప్పం( Koppam ).. ఇలా శాశ్వత నియోజకవర్గాల అంటూ ఉంటాయి. మరికొందరు నేతలైతే తమ నియోజకవర్గాల్లో బలమైన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తారు. ఒక్కో నియోజకవర్గంలో ఐదు నుంచి ఏడు సార్లు గెలిచిన నేతలు కూడా ఉన్నారు. వారికి నియోజకవర్గాల ప్రజలతో విడదీయరాని బంధం ఉంటుంది. అటువంటి నాయకులను వదులుకునేందుకు ప్రజలు కూడా ఇష్టపడరు. ఇప్పుడు పిఠాపురంలో కూడా అదే భావనతో ఉన్నారు అక్కడ ప్రజలు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్నారు. కానీ అక్కడ మరోసారి ఎమ్మెల్యేగా వర్మ రావాలని కోరుకుంటున్నారు ప్రజలు.

Also Read: కడపలో సరే.. మరి విశాఖలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహం అదే!

* సీటు త్యాగం
పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కోసం సీటు త్యాగం చేశారు వర్మ( pittapuram Varma ). 2014లో అయితే అక్కడ ఇండిపెండెంట్గా గెలిచారు వర్మ. టిడిపి టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి సత్తా చాటారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. ఐదేళ్లలో గెలిచే నియోజకవర్గంగా పిఠాపురంను మార్చేశారు. అటువంటి నియోజకవర్గాన్ని ఎన్నికలకు ముందు దక్కించుకున్నారు పవన్. పొత్తులో భాగంగా సీటును జనసేన దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉన్న వర్మ అధినేత చంద్రబాబు ఆదేశాలకు తలొగ్గి పవన్ కు అక్కడ ఛాన్స్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. డిప్యూటీ సీఎం గా మారి ఐదు కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం వర్మ సేవలను గుర్తు చేస్తుండడం విశేషం.

* వర్మపై సానుభూతి
పిఠాపురంలో వర్మపై విపరీతమైన సానుభూతి ఉంది. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేయడంపై గౌరవం ఉంది. కానీ ఇటీవల జనసేన ప్లీనరీలో( janasena planer ) నాగబాబు చేసిన కామెంట్స్ తో వర్మ పట్ల విపరీతమైన అభిమానం పెరుగుతోంది. సాధారణ ప్రజలు సైతం వర్మపై విపరీతమైన అభిమానం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వీడియో తెరపైకి వచ్చింది. ఈ వీడియోలో పిఠాపురంలోని స్థానిక మహిళ ఒకరు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని వర్మను కోరుతున్నారు. అయితే ఆ మహిళకు సమాధానం చెబుతూ నిలబడతాను అంటూ వర్మ నవ్వుతూ అనడం ఇప్పుడు వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది.

* వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియాలోనే..
అయితే ఈ వీడియో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సోషల్ మీడియా నుంచి బయటకు రావడం విశేషం. పిఠాపురంలో వచ్చే ఎన్నికల్లో వర్మని నిల్చోమంటున్న పిఠాపురం ఓటర్లు అనే క్యాప్షన్ తో ఈ వీడియో హల్చల్ చేస్తోంది. వైసీపీకి సంబంధించి ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేయడం గమనార్హం. గడిచిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో 65% ఓట్లు దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్. 70 వేల కు పైగా మెజారిటీతో గెలిచారు. అయితే ఈ గెలుపులో ఎవరి పాత్ర లేదని నాగబాబు ప్రకటించడంతో.. వర్మపై అభిమానం వెల్లువెత్తుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఈ వీడియో బయటకు రావడం గమనార్హం.